Nandyala: వేధింపులు తట్టుకోలేక.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఉరేసుకున్న తల్లి

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నంద్యాల పట్టణంలోని లలితా నగర్‌లో నివాసం ఉండే ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తల్లి ఉరేసుకొని అత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

New Update
FotoJet - 2026-01-18T104315.141

mother poisoned her two children and hanged herself

Nandyala:  ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నంద్యాల పట్టణం(nandyala-district) లోని లలితా నగర్‌లో నివాసం ఉండే ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తల్లి ఉరేసుకొని అత్మహత్య(Mother And Children Incident) కు పాల్పడినట్లు తెలుస్తోంది. భర్తతో పాటు అత్తింటి కుటుంబసభ్యుల వేధింపులు తాళలేక తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషాద ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పొయారు. పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని లలితానగర్‌కు చెందిన ఉదయ్‌కిరణ్‌కు, ఎన్జీవో కాలనీకి చెందిన మల్లిక(27)కు ఏడేళ్ల కిందట వివాహమైంది. వీరికి కుమారుడు ఇషాంత్‌సాయి(5), కుమార్తె పరిణిత(7 నెలలు) సంతానం. కొన్నేళ్లపాటు ఈ దంపతుల సంసారం సజావుగా సాగింది. గత కొంతకాలంగా భార్య భర్తల మద్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. గత రెండేళ్ల నుంచి భర్త ఉదయ్‌కిరణ్, తోటికోడలు ప్రసన్న, ఆడపడుచు గీత సూటిపోటి మాటలతో మల్లికను నిత్యం వేధిస్తున్నారని మల్లిక కుటుంబసభ్యులు అరోపిస్తున్నారు.

Also Read :  ఏపీ నిరుద్యోగులకు పవన్ అదిరిపోయే శుభవార్త.. 10 వేలకు పైగా జాబ్స్!

Unable To Bear The Harassment

ఈ నేపథ్యంలో నిన్న రాత్రి భార్య, భర్త(Wife and Husband) ల మద్య ఘర్షణ జరిగింది.శుక్రవారం మల్లికపై భర్త దాడి చేశాడు. మల్లిక అన్న కార్తిక్‌ ఇంటికి చేరుకుని అందరికీ సర్దిచెప్పి వెళ్లిపోయారు. అయితే మల్లిక తీవ్ర మనస్తాపం చెందింది. మరునాటి ఉదయం (శనివారం)  గదిలోకి వెళ్లిన మల్లిక తలుపులు తీయడం లేదని ఉదయ్‌కిరణ్‌ ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి చెప్పాడు. కార్తిక్‌ వచ్చి ఇంటి తలుపులు తీయగా మల్లిక ఉరి వేసుకుని కనిపించారు. ఇద్దరు పిల్లలు మృతిచెంది ఉన్నారు. కొన ఊపిరితో ఉన్న మల్లికను ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. మల్లికను ఉదయ్‌కిరణ్, ఆడపడుచు, తోటికోడలు తరచూ వేధించేవారని, పిల్లలను, తల్లిని భర్తే హత్య చేసి ఉంటాడని ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై హత్య కేసు నమోదు చేయాలని కోరారు. కాగా, ఈ ఘటన అనంతరం ఉదయ్‌కిరణ్, ఆయన కుటుంబసభ్యులు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. - Nandyal latest

Also Read :  ఆమెది ఆకర్షణ... అతనిది వసూలు.. హనీట్రాప్ తో భార్యభర్తల గలీజ్‌దందా..

Advertisment
తాజా కథనాలు