Arvind Panagariya: ప్రజలకు ఉచితాలు కావాలా? మెరుగైన సౌకర్యాలు కావాలా?: అరవింద్ పనగఢియా

ప్రముఖ ఆర్థిక వేత్త, 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగఢియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచితాలు కావాలా ? లేదా మెరుగైన సౌకర్యాలు కావాలా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలని తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.

New Update
Finance Commission Chairman Arvind Panagariya

Finance Commission Chairman Arvind Panagariya

ప్రముఖ ఆర్థిక వేత్త, 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగఢియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచితాలు కావాలా ? లేదా మెరుగైన సౌకర్యాలు కావాలా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం కేటాయించిన నిధులను రాష్ట్రాలు ఉచితాల కోసం వాడుతున్నారనే ఆరోపణలపై ఆయన తాజాగా ఈ విధంగా స్పందించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 

Also Read: పట్టపగలే యువతిని నడిరోడ్డుపై కత్తితో పొడిచి పొడిచి! (వీడియో వైరల్)

'' అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేటాయించిన డబ్బులను వాటి పనుల కోసం మాత్రమే వాడాలి. ఈ డబ్బును ఎలా ఖర్చు చేయాలనేది ఎన్నికైన ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. ఫైనాన్స్ కమిషన్ దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోదు. కానీ స్థూల ఆర్థిక స్థిరత్వం ప్రయోజనాల దృష్ట్యా సమస్యకు సంబంధించి అంశాన్ని లేవనెత్తచ్చు. అలాగే రాష్ట్రాలు ఆ మొత్తాన్ని ఎలా ఖర్చు చేయాలో కూడా నియంత్రించే అధికారం కమిషన్‌కు లేదు. 

Also Read: ఈ నెల‌లోనే ఉమ్మ‌డి పౌర స్మృతి అమ‌లు చేస్తాం: ఉత్త‌రాఖండ్ సీఎం

రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలను బట్టి పౌరులు ఓటువేస్తే కచ్చితంగా వాటి గురించే అడుగుతారు. కానీ తమకు ఉచితాలు కావాలా ? లేక మెరుగైన వ్యవస్థ, నీటి సరఫరా, మంచిరోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కావాలా ? అనేది ప్రజలే నిర్ణయించుకోవాలని'' అరవింద్ పనగఢియా అన్నారు. 

Also Read: భార్యలను ఎంతసేపు చూస్తూ కూర్చుంటారు..ఆదివారాలు పని చేయండి!

Also Read: వీడు మామూలు 'గే' కాదు : 11 మందిని దారుణంగా.. వీపుపై ద్రోహి అని రాసి!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు