Tirumala: తిరుమలలో మందు బాబు వీరంగం!

తిరుమలలో ఓ యువకుడు మద్యం మత్తులో రెచ్చిపోయాడు. మద్యం మత్తులో గుర్తు తెలియని యువకుడు ఒకడు ఓ మహిళతో గొడవకు దిగాడు.విజిలెన్స్‌ సిబ్బంది అతడ్ని ప్రశ్నించగా..వారితో కూడా అతను గొడవకు దిగాడు.

New Update
tirumala drunkmantirumala drunkman

tirumala drunkman

Tirumala: తిరుమలలో ఓ యువకుడు మద్యం మత్తులో రెచ్చిపోయాడు. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగితే.. తాజాగా వీడియో బయటపడింది. తిరుమలలో మద్యం మత్తులో గుర్తు తెలియని యువకుడు ఒకడు ఓ మహిళతో గొడవకు దిగాడు.. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న విజిలెన్స్‌ సిబ్బంది అతడ్ని ప్రశ్నించారు.. ఎందుకు గొడవపడుతున్నావని అడిగారు. 

Also Read: Bsnl Cheapest Recharge Plan: ఓరి దేవుడా.. రూ.750లకే 6 నెలల వ్యాలిడిటీ- 180 GB డేటా కూడా!

Also Read: Nagababu Vs Bandla Ganesh: కృతజ్ఞత లేకుండా బతకొద్దు.. నాగబాబుకు బండ్ల గణేష్ కౌంటర్!

నేను లోకల్...

విజిలెన్స్ సిబ్బందితో కూడా ఆ యువకుడు వాగ్వాదానికి దిగాడు. అక్కడితో ఆగకుండా.. 'నేను లోకల్ మందు తాగుతా అవసరమైతే మందు కూడా అమ్ముతా' అంటూ రెచ్చిపోయాడు. తిరుమల శ్రీవారి ఆలయ మాడవీధుల్లోనే మద్యం మత్తులో యువకుడు ఇలా గొడవకు దిగడం కలకలం రేపింది. పోలీసులు అక్కడికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఆ యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.. అతడు మహిళతో గొడవకు దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: UNESCO: తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు.. యూనెస్కో జాబితాలో ముడమాల్‌ నిలువురాళ్లు

Also Read:  Holi colours: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు