/rtv/media/media_files/2025/11/01/srikakulam-kashibugga-stampede-2025-11-01-15-48-08.jpg)
Srikakulam kashibugga Stampede
ఇటీవల తమిళనాడులో నటుడు విజయ్ ర్యాలీలో ఘోరమైన తొక్కిసలాట ఘటన జరిగింది. ఇందులో దాదాపు 41 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరువక ముందే ఇప్పుడు మరొక తొక్కిసలాట ఘటన ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. ఇవాళ (శనివారం) ఆంధ్రప్రదేశ్‌లో భారీ తొక్కిసలాట ఘటన జరిగింది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రజలు ఒకరిపై ఒకరు తొక్కుకున్నారు.
Srikakulam kashibugga Stampede
ముందుగా ఆలయం లోపలకి ప్రవేశించే ముందు గేట్ల వద్ద భారీగా భక్తులు చేరుకున్నారు. ఈ క్రమంలోనే గేట్ ఓపెన్ చేయగా.. మెట్లపై గందరగోళం ఏర్పడింది. దీంతో మెట్లపై ఉన్న భక్తులు ఒకరిపై ఒకరు తోసుకుని కిందపడిపోయారు. అదే సమయంలో కింద పడిపోయిన వారిని తొక్కుకుంటూ ప్రజలు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 9 మంది భక్తులు ప్రాణాలు విడిచారు. అనేక మంది గాయపడ్డారు.
అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. గుడి యాజమాన్యం చేసిన ఒక చిన్న తప్పిదం వల్లే ఈ ఘోరమైన ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కనీసం పోలీసులకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఆలయానికి భారీ ఎత్తున భక్తులకు అనుమతినివ్వడమే ఆలయ యాజమాన్యం చేసిన పెద్ద తప్పు అని తెలుస్తోంది.
Andhra Pradesh: Stampede at Venkateswara Temple in Kashibugga, Srikakulam district; several devotees dead, injuries reported. pic.twitter.com/owMt8cEI6j
— The Siasat Daily (@TheSiasatDaily) November 1, 2025
ఆ ఒక్క తప్పే కారణం
సాధారణంగా ఒక చిన్న వేడుక లేదా సాదాసీదా సెలబ్రెటీ వస్తేనే పోలీసుల అనుమతి తీసుకోవలసి ఉంటుంది. అలాంటిది కార్తీక మాసంలో అది కూడా ఏకాదశి రోజు ఆలయాలకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని తెలిసి కూడా ఆలయ యాజమాన్యం పోలీసులకు ఎలాంటి ఇన్ఫార్మ్ చేయలేదని.. వారి నుంచి అనుమతి తీసుకోకుండానే భారీగా తరలి వచ్చిన భక్తులను ఆలయంలోకి అనుమతించారని తెలుస్తోంది. ఈ ఒక్క కారణంతోనే 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. ఒకవేళ ఆలయ యాజమాన్యం పోలీసులకు ముందస్తు సమాచారం అందించి ఉంటే.. వారు కొంత మంది పోలీసులను ఏర్పాటు చేసుండేవారని.. దీంతో ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని చర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఈ విషాద సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేస్తూ.. ఈ విషాద సంఘటనలో భక్తుల మరణాలు హృదయ విదారకంగా ఉన్నాయని పేర్కొన్నారు. గాయపడిన వారికి సత్వర, తగిన చికిత్స అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Follow Us