/rtv/media/media_files/2025/04/17/9DKFkB0tCzAjN6jn8MGj.jpg)
Tirupati Hostel
Tirupati: తిరుపతిలోని ఓ నర్సింగ్ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. నర్సింగ్ కాలేజీకిఇ చెందిన ప్రిన్సిపాల్ అర్థరాత్రి సమయంలో స్థానిక లీలామహల్ సర్కిల్ లో ఉన్న వర్మ కాలేజీ నర్సింగ్ హాస్టల్‌లోకి ప్రవేశించడం కలకలం రేపింది.
అర్థరాత్రి సమయంలో విద్యార్థినిలంతా ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా ఒక వ్యక్తి గదిలోకి ప్రవేశించడంతో విద్యార్థినీలు ఆందోళనకు గురయ్యారు. ఏదో అలికిడి వినిపించడంతో విద్యార్థినిలు ఒక్కసారిగా లేచి కూర్చున్నారు. వెంటనే అప్రమత్తమైన విద్యార్థినీలు సదరు వ్యక్తిని పట్టుకున్నారు. అయితే వచ్చింది తమ ప్రిన్సిపాల్ అని తెలిసి అవాక్కయ్యారు. గదిలో బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.దీంతో, రంగంలోకి దిగిన అలిపిరి పోలీసులు.. ప్రిన్సిపాల్ వర్మను అదుపులోకి తీసుకున్నారు.. ఇక, అలిపిరి పోలీస్ స్టేషన్ ఎదుట విద్యార్థినులు ఆందోళనకు దిగారు.. వర్మను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు..
Also Read: Ap Rains: ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు..!
అయితే ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి. పక్క భవనంలో దూకిన విద్యార్థినిని నిలదీసిన ప్రిన్సిపాల్ వర్మపై కావాలనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని కొందరు స్టూడెంట్స్ తెలిపారు. కేవలం రాత్రి సమయంలో వేరే చోటకు వెళ్తున్న వారిని నిలువరించేందుకు ప్రిన్సిపాల్ అక్కడకు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి వాస్తవాలపై విచారణ జరుపుతున్నారు. ప్రిన్సిపాల్ వర్మ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు అంటూ కొందరు విద్యార్థినులు.. ప్రిన్సిపాల్‌కు బాసటగా నిలిచారు.. కేవలం రాత్రి సమయంలో వేరే చోటకు వెళ్తున్న వారిని నిలువరించేందుకు ప్రినిపాల్ వర్మను పిలిచినట్టు వారు చెబుతున్నారు.. దీంతో, ఈ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది.
Also Read: Indian Students: ఆ మూడు దేశాలకు భారీగా తగ్గిన భారతీయ విద్యార్థులు..!
కాగా.. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు విచారణ చేపట్టారు అలిపిరి పోలీసులు.. అయితే, విచారణ అనంతరం ప్రిన్సిపాల్ వర్మపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు అలిపిరి పోలీసులు.. మరోవైపు.. న్యాయం చేయాలంటూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. విషయం తెలిసిన విద్యార్థినిల తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపాల్ హోదాలో ఉండి ఇలాంటి పనులా అంటూ మండిపడుతున్నారు. హాస్టల్‌లో ఉన్న తమ బిడ్డలకు రక్షణ ఎలా కల్పిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఎంతో క్రమశిక్షణతో ఉండాల్సిన ఓ ప్రిన్సిపాల్ ఇలా అర్ధరాత్రి సమయంలో విద్యార్థినిల హాస్టల్‌లోకి దూరడం పెను సంచలనంగా మారింది.
Also Read: Google: 247 మిలియన్ల ప్రకటనలపై గూగుల్ ఉక్కుపాదం!