JOBS : తార్నాక నర్సింగ్ కాలేజీలో ఉద్యోగాలు.. రేపే ఇంటర్వ్యూలు
టీఎస్ ఆర్టీసీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్ తార్నాకలోని నర్సింగ్ కాలేజీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వైస్ ప్రిన్సిపాల్, అసోసియేట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు దరఖాస్తులు కోరింది. ఎంఎస్సీ, పీహెచ్డీ అర్హతగల అభ్యర్థులను జనవరి 23న ఇంటర్వ్యూలకు ఆహ్వానించింది.