BREAKING: కర్నూల్ ఘోర బస్సు ప్రమాదం.. TGSRTC కీలక ప్రకటన!

తాజాగా టీజీఎస్‌ఆర్టీసీ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేసింది. బస్సుల్లో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఎలా వ్యవహరించాలో చెబుతూ ఓ పోస్టు చేసింది.

New Update
TSRTC Key Announcement on Bus Safety Precautions

TSRTC Key Announcement on Bus Safety Precautions

ఏపీలోని కర్నూలు జిల్లాలో కావేరీ ట్రావెల్స్‌ బస్సులో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో బైకర్‌తో సహా 20 మంది మృతి చెందారు. ఈ క్రమంలోనే తాజాగా టీజీఎస్‌ఆర్టీసీ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేసింది. బస్సుల్లో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఎలా వ్యవహరించాలో చెబుతూ ఓ పోస్టు చేసింది. '' TGSRTC వివిధ రకాల బస్సుల్లో ప్రయాణికలను తమ గమ్యస్థానాలకు చేరవేస్తోంది. 

Also Read: నవీన్ యాదవ్‌కు బిగ్ షాక్.. తండ్రి శ్రీశైలం యాదవ్ బైండోవర్

ప్రయాణికుల క్షేమం కోసం బస్సుల్లో సేఫ్టీ ప్రీకాషన్స్‌ను ఏర్పాటు చేశాం. లహరి ఏసీ స్లీపర్, లహరి ఏసీ స్లీపర్ కం సీటర్, రాజధాని ఏసీ బస్సుల్లో వెనుక భాగంలో ఉన్న అత్యవసర ద్వారాన్ని, కిటికీ అద్దాలు పగలగొట్టేందుకు  టూల్స్ అమర్చాం. సుత్తెలు, మంటలు ఆర్పేందుకు ఫైర్ ఎక్స్టింగిషర్, అలాగే డ్రైవర్‌ క్యాబిన్ ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్, మంటలు ఆర్పే పరికరాన్ని అమర్చాము. 

Also Read: పరువు తీశారు కదరా.. విదేశీ యూట్యూబర్‌ను పేడలో ముంచిన భారతీయులు

ప్రయాణికులను అలెర్ట్ చేసేందుకు సైరన్ కూడా ఏర్పాటు చేశాం. సూపర్ లగ్జరీ బస్సుల్లో ఫైర్ ఎక్స్టింగిషర్, బస్సు వెనుక భాగంలో కుడివైపు ఎగ్జిట్‌ డోర్‌ను ఏర్పాటు చేశాం. డీలక్స్, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో కుడివైపు వెనుక భాగంలో అత్యవసర డోర్, ఫైర్ ఎక్స్టింగిషర్‌లు ఏర్పాటు చేశాం. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం'' అంటూ రాసుకొచ్చింది. 

Also Read: కర్నూలు బస్సు దుర్ఘటన సమీపంలో మరో ప్రమాదం.. 3 కార్లు నుజ్జు నుజ్జు!

Advertisment
తాజా కథనాలు