/rtv/media/media_files/2025/10/15/target-naveen-yadav-2025-10-15-14-02-44.jpg)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల నేపథ్యంలో ఆయన తండ్రి రౌడీ షీటర్ చిన్న శీశైలం యాదవ్ పోలీస్ స్టేషన్‌లో బైండోవర్ అయ్యారు. చిన్న శ్రీశైలం యాదవ్‌తో సహా వందమంది రౌడీ షీటర్ల బైండోవర్ అయ్యారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు ఆ నియోజవకర్గంలో 100 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు. బోరబండ పోలీస్ స్టేషన్‌లో అత్యధికంగా 74 మంది రౌడీ షీటర్లు ఉన్నారు.
కాంగ్రెస్‌కు బిగ్ షాక్!
— Konatham Dileep (@KonathamDileep) October 27, 2025
కాంగ్రెస్ అభ్యర్ధి తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ బైండోవర్!
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ తో సహా వందమంది రౌడీ షీటర్ల బైండోవర్.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా 100 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేసిన పోలీసులు.
బోరబండ పీఎస్ లో…
బైండోవర్ అంటే..
బైండోవర్ అంటే చట్టపరమైన పరిభాషలో 'సత్ప్రవర్తనకు హామీ' అని అర్థం.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తారని లేదా ఏదైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడతారని పోలీసులు అనుమానించిన వ్యక్తులను (ముఖ్యంగా ఎన్నికల సమయంలో రౌడీ షీటర్లు, పాత నేరస్తులు వంటివారిని) ముందస్తు జాగ్రత్త చర్యగా స్థానిక తహసీల్దార్ లేదా ఆర్డీఓ (RDO) వంటి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు.
ఆ వ్యక్తి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడబోనని లిఖితపూర్వకంగా ఒక బాండ్ పేపర్‌పై హామీ ఇస్తాడు. వారు సొంత పూచీకత్తుపై విడుదల చేయబడతారు.
సాధారణంగా, బైండోవర్ అయిన వ్యక్తి ఆ రోజు నుంచి నిర్ణీత కాలం (ఉదాహరణకు, ఆరు నెలలు లేదా ఒక సంవత్సరం) వరకు ఎలాంటి నేరాలకు పాల్పడకూడదు.
ఒకవేళ బైండోవర్ అయిన తర్వాత వారు నేరానికి పాల్పడితే, వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రక్రియను క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్లు 107, 108, 109, 110 కింద నిర్వహిస్తారు.
Follow Us