/rtv/media/media_files/2025/11/16/fotojet-2025-11-16t130557099-2025-11-16-13-06-54.jpg)
Tension once again in Hindupuram
Hindupuram : హిందూపురంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న హిందూపురంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై బాలకృష్ణ(balakrishna) అభిమానులు, టీడీపీ నాయకులు దాడి(Attacks On YSRCP Leaders) చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ దాడిని ఖండిస్తూ నేడు నిరసన తెలిపేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అడుగడుగున అడ్డుకున్నారు. కాగా ఇప్పటికే హిందూపురంలో స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటిస్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు వైసీపీ నేతలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు.కదిరిలో వైఎస్సార్‌సీపీ నాయకులు సతీష్ రెడ్డిని అడ్డుకుని.. హిందూపురం వెళ్లకుండా ఆంక్షలు విధించారు. మరోవైపు.. హిందూపురం వైఎస్సార్‌సీపీ సమన్వయ​కర్త దీపికకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అలాగే, కదిరి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మక్బూల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
Also Read : రాజకీయాల్లోకి వంగవీటి వారసురాలు.. ఏ పార్టీలోకి అంటే?
YCP-TDP War
కాగా తనను అడ్డుకోవడంపై వైఎస్సార్‌సీపీ నాయకులు సతీష్ రెడ్డి మాట్లాడుతూ..‘హిందూపురం వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై టీడీపీ గూండాలు దారుణంగా దాడి చేశారు. ఈ దాడికి పాల్పడిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు?. అని ఆయన ప్రశ్నించారు. పోలీసులు తమ విధులను సరిగా నిర్వర్తించడం లేదు. వేణు రెడ్డి ఏం తప్పు మాట్లాడారో చెప్పండి? అని ప్రశ్నించారు. ఆందోళన చేపట్టే స్వేచ్చ కూడా ఏపీలో లేదా?. ఏపీలో ప్రజల గొంతుకను కూటమి పాలకులు నొక్కేస్తున్నారని ఆరోపించారు. పోలీసు వ్యవస్థను కూటమి నేతలు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా అక్రమ కేసులు పెడుతున్నారు. టీడీపీ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?. అని తీవ్రంగా నిలదీశారు. అధికార పక్షానికి ఒక న్యాయం.. ప్రతిపక్షానికి మరో న్యాయమా?’ అని మండిపడ్డారు.
ఇదిలా ఉండగా.. వైసీపీ నేత వేణు రెడ్డి బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యాలకు నిరసనగా శనివారం హిందూపురంలో అధికార తెలుగు దేశం పార్టీ నాయకులు స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో కార్యాలయం అద్దాలు, ఫర్నీఛర్, అక్కడే ఉన్న ఓ వాహనం ధ్వంసం అయ్యాయి. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కూడా దాడి చేశారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. ఈ దాడిని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేసింది. ఈ రోజు నిరసన చేపట్టడానికి ప్రయత్నించగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
Also Read : అల్పపీడనం ఎఫెక్ట్.. తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు!
Follow Us