/rtv/media/media_files/2025/11/17/mydukur-mla-wife-digital-arrest-2025-11-17-16-34-12.jpg)
Putta Sudhakar Yadav
రోజు రోజుకు సైబర్ క్రిమినల్స్ ఆగడాలు పెరిగిపోతున్నాయి. సంపన్నులు, రిటైర్డ్ ఉద్యోగులు, డబ్బున్న వృద్ధులనే టార్గెట్‌గా పెట్టుకుని సర్వం దోచేస్తున్నారు. ఇందులో సెలబ్రెటీలు, రాజకీయ వ్యక్తులు కూడా ఉన్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యే ఫ్యామిలీ సైబర్ వలలో చిక్కుకుని రూ.1.70 కోట్లు పోగొట్టుకుంది. చివరికి రంగంలోకి దిగిన పోలీసులు సైబర్ కేటుగాళ్లను అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Putta Sudhakar Yadav wife digital arrest
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు తెలుగుదేశం పార్టీ (TDP) ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ భార్య సైబర్ వలలో చిక్కుకున్నారు. ఆమెకు ఒక రోజు అన్‌నౌన్ నెంబర్ నుంచి ఒక వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. ఆమె లిఫ్ట్ చేయగానే.. అవతలి వ్యక్తులు తమను తాము సీబీఐ, బ్యాంక్, పోలీసు ఆఫీసర్లుగా పరిచయం చేసుకున్నారు.
ఆ తర్వాత ఆమె పేరు మీద భారీ మొత్తంలో మనీ లాండరింగ్ జరిగిందని భయపెట్టారు. ఈ కేసులో చిక్కుకుంటే జైలుకెళ్లడం ఖాయమని బెదిరించారు. ప్రస్తుతం ఈ కేసు పైన విచారణ జరుగుతుందని.. అందువల్ల ఇది పూర్తయ్యేంతవరకు ఫోన్‌ను ఆఫ్ చేయకుండా వీడియో కాల్‌లోనే ఉండాలని తెలిపారు. అక్కడితో ఆగకుండా.. ఈ కేసుకు సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని.. మరింత బెదిరించే ప్రయత్నం చేశారు.
ఇలా ‘‘డిజిటల్ అరెస్టు’’ పేరుతో ఆమె వద్ద నుంచి దాదాపు రూ.1.70 కోట్లు ట్రాన్సఫర్ చేయించుకున్నారు. ఆ తర్వాత ఫోన్ కట్ చేసి కనిపించకుండా పోయారు. దీంతో తాను మోసపోయానని భావించిన ఆమె వెంటనే ఈ విషయాన్ని తన భర్త, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌కు చెప్పింది. ఆయన హుటాహుటిన జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపి ఫిర్యాదు చేశారు.
ఆయన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు దాదాపు ఏడుగురు నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు. వీరిలో ఢిల్లీకి చెందిన ఐడీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజర్ కూడా ఉండటం సంచలనంగా మారింది.
Follow Us