krishna district Kodur
Krishna District Kodur : కృష్ణజిల్లా కోడూరులో ఓ కామాంధుడు అరాచకానికి పాల్పడ్డాడు. చదువు చెప్పే ఓ టీచర్ కనీస మానవీయ విలువలు లేకుండా మూడవ తరగతి చదువుతున్న చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్థించాడు.
Also Read: హీరో విజయ్ దేవరకొండకు ప్రమాదం.. VD12 షూటింగ్ లో అలా..!
కీచక టీచర్ బాగోతం
అయితే నరసింహపురం ఎంపీపీ స్కూల్లో మూడవ తరగతి చదువుతున్న బాలిక పట్ల .. అదే స్కూల్లో పనిచేసే ఓ టీచర్ నాలుగు రోజుల నుంచి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ బాలిక తొడపై కొరికి నీచానికి దిగజారుడు. దీంతో చిన్నారి టీచర్ ప్రవర్తన గురించి తల్లిదండ్రులకు చెప్పడంతో.. ఆ కీచకుడి బాగోతం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే కోడూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఓ టీచర్ ఈ విధంగా ప్రవర్తించడాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు.
Also Read: వరుణ్, లావణ్య మొదటి పెళ్లిరోజుకు మెగాస్టార్ అదిరిపోయే గిఫ్ట్!.. వీడియో వైరల్
ఇదిలా ఉండగా ఇటీవల మెదక్ జిల్లాలో కూడా దారుణ ఘటన చోటుచేసుకుంది. యువతి ప్రేమించడం లేదని ఓ యువకుడు ప్రేమోన్మాది దాడి చేశాడు. మెదక్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎదుట యువతి చేయిని కోసి పరారయ్యాడు. యువతి చేతికి తీవ్రంగా గాయాలు కావడంతో చికిత్స కోసం వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఇంకా విషమించడంతో వెంటనే హైదరాబాద్ తరలించారు. యువకుడు బెంగళూరుకి చెందిన చేతన్‌గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆ యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ మధ్య కాలం యువతులు, మహిళలను వేధించే ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. చెప్పిన పనులు చేయడం లేదని, ప్రేమను ఒప్పుకోలేదని విచక్షణ కోల్పోయి ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు దుర్మార్గులు.
Also Read: వరుణ్, లావణ్య మొదటి పెళ్లిరోజుకు మెగాస్టార్ అదిరిపోయే గిఫ్ట్!.. వీడియో వైరల్
Also Read: చిరు, నాగ్, వెంకీలో నాకు ఇష్టమైన హీరో అతనే.. బాలయ్య భలే చెప్పాడుగా!