Heat Alert: ఏపీ ప్రజలకు అలర్ట్..నేడు ఆ మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు!
వాతావరణ శాఖ ఏపీకి ఓ కీలక హెచ్చరికను జారీ చేసింది. సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 47 మండలాల్లో తీవ్ర మైన వడగాల్పులు, 151 మండలాల్లో వడగాలులు విపరీతంగా ఉంటాయని పేర్కొంది.
వాతావరణ శాఖ ఏపీకి ఓ కీలక హెచ్చరికను జారీ చేసింది. సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 47 మండలాల్లో తీవ్ర మైన వడగాల్పులు, 151 మండలాల్లో వడగాలులు విపరీతంగా ఉంటాయని పేర్కొంది.
శ్రీకాకుళం జిల్లా పారంపేటలో వైసీపీ కార్యకర్త సత్తిబాబుపై టీడీపీ కార్యకర్త గణేష్ కర్రతో దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడిలో సత్తిబాబు తలకు తీవ్రగాయాలు అయ్యాయి. రాజాం నియోజకవర్గ వైసీపీ అభ్యర్ధి తలై రాజేష్ ఈ దాడిని ఖండించారు. కార్యకర్తల జోలికొస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
శ్రీకాకుళం టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా కలమట వెంకట రమణ మూర్తి నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు చాలా పెద్ద బాధ్యత తనపై ఉంచారన్నారు. శ్రీకాకుళం జిల్లాను గెలిపించుకునే బాధ్యత తనదని ..పసుపు జెండా పవర్ చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఏపీ సీఎం జగన్ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో ఆయన బస్ యాత్ర కొనసాగుతోంది. జగన్ స్పీచ్ లైవ్ కోసం ఈ వీడియోను చూడండి.
AP: కాంగ్రెస్‌పై మోడీ విషం చిమ్ముతున్నారని అన్నారు షర్మిల. మతాల మధ్య మళ్లీ చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రేమను నింపే మాటలు మాట్లాడుతున్నారని.. మోడీ మాత్రం మతాలను విడదీసి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
పిఠాపురం కూటమి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో చేబ్రోలు నుంచి పిఠాపురంలో పాదగయక్షేత్రం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. పవన్ నామినేషన్ కార్యక్రమం లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
ఏపీ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల తుది జావితాను కొతసేపటి క్రితం రిలీజ్ చేసింది. మొత్తం 38 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా...అందులో 10 స్థానాల్లో కొత్త వాళ్ళ మార్చినట్టు ప్రకటించింది.
అడవి తల్లి బిడ్డలను పాలకులు కేవలం ఓటర్లుగానే చూస్తున్నారన్నారు ఎంపీ స్వతంత్ర అభ్యర్థి వాభ యోగి. నేటికీ డోలిపై రోగులను తీసుకెళ్లే దుస్థితిలోనే ఆదివాసీలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి బ్రతుకుల్లో వెలుగులు నింపేందుకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానన్నారు.
తన కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని కలలో కూడా అనుకోలేదన్నారు గొండు జగన్నాధరావు. RTVతో ఆయన ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ.. ధర్మాన ప్రసాదరావుపై కౌంటర్ వేశారు. ధర్మానే కాదు.. ఆయన్ని పుట్టించిన వాడు వచ్చినా తన కొడుకు విజయాన్ని ఆపలేరన్నారు.