కొండెక్కిన కోడి ...కిలో రూ. 270!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదలు చికెన్ రేట్ల పై భారీ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రిటైల్ మార్కెట్లో కేజీ 250 నుంచి 270 రూపాయల వరకు ఉంది. ధరలు పెరగడంతో చికెన్ అమ్మకాలు సగానికి సగం తగ్గాయి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదలు చికెన్ రేట్ల పై భారీ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రిటైల్ మార్కెట్లో కేజీ 250 నుంచి 270 రూపాయల వరకు ఉంది. ధరలు పెరగడంతో చికెన్ అమ్మకాలు సగానికి సగం తగ్గాయి.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో.. నేడు కోస్తా ప్రాంతంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఏపీ శ్రీకాకుళం లంకపేటలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఐదుగురు గ్రామస్థులపై తేనెటీగలు దాడి చేయగా కాంతమ్మ, సూరి అనే ఇద్దరు మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా చికిత్స కోసం విశాఖ కెజిహెచ్ కు తరలించారు.
సంక్రాంతి పండుగకు నాలుగు నెలల ముందే రెగ్యులర్ రైళ్లన్నీ నిండిపోయాయి. రిజర్వేషన్ ఓపెన్ చేసిన నిమిషాల్లోనే ఖాళీ అయిపోయాయి.ఈ క్రమంలో ప్రయాణికుల కోసం 400 స్పెషల్ సర్వీసులు నడపాలనిదక్షిణ మధ్య రైల్వే అధికారులు భావిస్తున్నారు.
బంగాళాఖాతంలో మరి కొన్ని గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వివరించింది. ఈ అల్పపీడనం రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడనుందని ప్రకటించింది. దీని ప్రభావంతో ఏపీలో అక్కడక్కడా వర్షాలు కురవనున్నాయి.
ఉత్తరాంధ్రలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ క్రమంలో ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ సోమవారం పలు జిల్లాల పాఠశాలలకు సెలవు ప్రకటించింది. పునరావాస కేంద్రాలు, ముంపు ప్రాంతాల్లో స్కూల్స్ బందు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారి స్పష్టం చేశారు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర మళ్లీ రచ్చ మొదలైంది. దువ్వాడ ఇంట్లోకి దివ్వెల మాధురి రీ-ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు ఇంట్లోకి దువ్వాడ వాణి వెళ్లొచ్చని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులతో కలిసి దువ్వాడ ఇంటికొచ్చిన వాణి ఇంట్లోకి రానివ్వాలంటూ ఆందోళన చేపట్టింది.
తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గైట్ కాలేజీకి చెందిన ప్రవీణ్, కార్తీక్ అనే విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. వెనుక నుండి వచ్చిన బొగ్గు లారీ బలంగా ఢీకొని వారిద్దరిపై ఎక్కి రోడ్ పై కొంత దూరం ఈడ్చుకెళ్లింది. దాంతో విద్యార్థుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.