/rtv/media/media_files/1NZSUZTkqcSs4CsX2Bv2.jpg)
AP News: శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం సాయంత్రం దారుణం జరిగింది. రణస్థలం మండలం లంకపేట గ్రామంలో ఐదుగురిపై తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగల దాడిలో ఇద్దరు మృతి చెందగా.. గాయపడిన వారిని పలువురిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు స్థానికులు. మృతులను కిల్లారి కాంతమ్మ, కిల్లరి సూరి కిష్టప్పడుగా గుర్తించారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండగా మెరుగైన చికిత్స కోసం విశాఖ కెజిహెచ్ కి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.