అద్భుతం.. మూలవిరాట్‌ను తాకిన సూర్య కిరణాలు శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో సూర్యకిరణాలు ఈరోజు ఉదయం 6 నిమిషాల పాటు మూలవిరాట్‌ను తాకాయి. భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని చూసి పరవశించారు. మార్చి 9, 10, 11, 12.. అక్టోబర్1, 2, 3, 4 తేదీల్లో సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతాయి. By Kusuma 01 Oct 2024 in లైఫ్ స్టైల్ ఆంధ్రప్రదేశ్ New Update షేర్ చేయండి శ్రీకాకుళంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన అరసవల్లిలో అద్భుతం జరిగింది. ఈ ఆలయంలోని సూర్యనారాయణ స్వామి వారి మూల విరాట్‌ను సూర్య కిరణాలు ఏటా తాకుతాయి. ఇంతటి అద్భుతమైన ఘటన ఈరోజు ఉదయం 6:05 నిమిషాలకు జరిగింది. దాదాపుగా 6 నిమిషాల పాటు సూర్యకిరణాలు సూర్యనారాయణ స్వామి వారి పాదాల నుంచి శిరస్సు వరకు తాకాయి. ఇంతటి అద్భుత ఘటనను చూడటానికి సూర్య భగవాన్ భక్తులు తండోపదండాలుగా తరలివచ్చారు. ఇది కూడా చూడండి: గేమ్ ఛేంజర్' సాంగ్.. చరణ్ డ్యాన్స్ పై సమంత కామెంట్ వైరల్ అద్భుత ఘట్టాన్ని చూస్తే.. సూర్య కిరణాలు స్వామి వారి పాదాలను తాకుతుంటే భక్తులు ఆ అద్భుతాన్ని చూసి పరవశించిపోయారు. ప్రతి ఏడాది రెండుసార్లు సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకుతాయని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. రేపు కూడా సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకనున్నాయని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది మార్చిలో 9, 10వ తేదీల్లో స్వామి వారి పాదాలను సూర్యకిరణాలు తాకాయి. ప్రతీ ఏడాది మార్చి 9, 10, 11, 12 తేదీల్లో, అక్టోబర్ నెలలో 1, 2, 3, 4 తేదీల్లో సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతాయి. ఇది కూడా చూడండి: రుణమాఫీ కాలేదని.. మనస్తాపంతో రైతు ఆత్మహత్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లిలో సూర్యనారాయణ స్వామి ఆలయం ఉంది. దేశంలోనే ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది. సూర్యనారాయణ మూర్తిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్తుంటారు. ఈ ఆలయంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు రథసప్తమి రోజు దేవున్ని దర్శించుకోవడానికి భారీగా వెళ్తుంటారు. #temple మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి