Nara Lokesh: వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించేందుకుఏపీ ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టింది. ప్రస్తుత డిజిటల్ కాలంలో డాక్యుమెంట్లు, ధ్రువపత్రాల కోసం ఆఫీసులు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఎప్పటి నుంచో వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందిస్తామనే చెబుతున్న విషయంలో.. ఏపీ ఐటీశాఖ మంత్రి లోకేష్ ఏపీ ప్రజలకు ఈ విషయం గురించి తెలియజేశారు.
Also Read: Elon Musk: 400 బిలియన్ డాలర్ల క్లబ్ లో మస్క్..!
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న లోకేష్.. వాట్సాప్ ద్వారా 153 పౌర సేవలు అందించనున్నట్లు తెలిపారు. మరో పది రోజుల్లో ఈ సేవలు ప్రారంభించేందుకు చర్యలు మొదలు పెట్టనున్నట్లు మంత్రి వివరించారు.
Also Read: HYD: ఏంటీ రచ్చ..మీ ఇంట్లో గొడవ పడండి–మంచు విష్ణుకు సీపీ వార్నింగ్
మరోవైపు ఒకే వెబ్‌సైట్ ద్వారా ప్రభుత్వ సమాచారం అంతా లభించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు లోకేష్ చెప్పారు. జనన, మరణాల ధ్రువ పత్రాల జారీకి పాటిస్తున్న విధానంపైనా సమీక్ష చేయాల్సి ఉందని మంత్రి తెలిపారు.
అలాగే విద్యాశాఖలో అపార్ ఐడీ జారీ సమయంలో ఎదురైన ఇబ్బందులను సరిచేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే యూఏఈలో మాత్రమే ఒకే ప్లాట్ ఫామ్ ద్వారా పౌర సేవలు అందిస్తున్నారని లోకేష్ వివరించారు. ఆ తరహా విధానాన్నే ఏపీలోనూ తీసుకుని వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించేందుకు మెటాతో ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. మరో పది రోజుల్లో 153 సేవలు అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు.
Also Read: ఇందిరమ్మ ఇళ్లకు 80 లక్షల దరఖాస్తులు.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మంత్రి లోకేష్ సమక్షంలో ఏపీ ప్రభుత్వ అధికారులు, మెటా ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. మెటాతో ఒప్పందం నేపథ్యంలో.. కుల ధ్రువీకరణ పత్రాలు, జనన, మరణ ధ్రువపత్రాల దగ్గర నుంచి కరెంట్ బిల్లులు, ఇంటి పన్నులు, నల్లా పన్ను వంటి బిల్లుల చెల్లింపుల వరకూ అన్ని పౌరసేవలనూ వాట్సాప్ లోనే పొందవచ్చు.
Also Read: Space Station: ఆ ఏడాదికి భారత్‌కు సొంతంగా స్పేస్ స్టేషన్..!
వేగంగా, సులువుగా ధ్రువపత్రాలు పొందటంతో పాటుగా.. వాటిని ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉండదని ప్రభుత్వం చెప్తోంది. ఈ క్రమంలోనే 153 రకాల సేవలను మరో పదిరోజుల్లో అందుబాటులోకి తెస్తామని లోకేష్ కలెక్టర్ల సమావేశంలో తెలిపారు.