/rtv/media/media_files/2024/11/30/7nvGRvjhpxjO5eRg9G4K.webp)
Ap Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇప్పుడు శ్రీలంక తీరంలో నైరుతి బంగాళాఖాతం మీద ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వచ్చే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా శ్రీలంక-తమిళనాడు తీరాల వైపు కదులుతూ కొనసాగే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
Also Read: Elon Musk: 400 బిలియన్ డాలర్ల క్లబ్ లో మస్క్..!
ఇవాళ ప్రకాశం, కడప, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, అన్నమయ్య ,నెల్లూరు,నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.అల్పపీడనప్రభావంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతలు కోసిన రైతులు పంట ఏమవుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు. గత నెల చివరిలో ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఈదురు గాలులు వర్షాలకు వేల ఎకరాల్లో కోతకు వచ్చిన పంట నేల వాలిన సంగతి తెలిసిందే.
Also Read: సోషల్ మీడియాలో అంతరాయం..రెండు గంటలపాటూ ఇబ్బందులు పడ్డ యూజర్లు
మళ్లీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే వరికోతలు పూర్తికాగా.. వీటిలో కొన్నిచోట్ల ఎండబెట్టగా, మరికొందరు కుప్పలు వేయించారు. మళ్లీ వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించడంతో రైతులు ఆందోళన పడుతున్నారు. రైతులు తమ పంటను కాపాడుకునేందుకు సతమతమవుతున్నారు. రాష్ట్రంలో వరి కోతలు కోసిన రైతులు రోడ్డు పక్కన పోసిన ధాన్యాన్ని గుట్టలుగా పోసి తడవకుండా పట్టాలు కప్పి రక్షించుకుంటున్నారు.
Also Read: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో తేమశాతం నిబంధనలు ఉండడంతో రైతులు రోడ్లు, ఖాళీ ప్రదేశాల్లో పట్టాలపై ధాన్యాన్ని ఆరబెట్టారు. రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయనే అనుమానంతో రైతులు ధాన్యాన్ని జాగ్రత్త చేసుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. అలాగే వర్షానికి తడవక ముందే నిబంధనలు సడలించి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేసేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
Also Read: IRAN: హిజాబ్ ధరించకపోతే ఉరిశిక్ష–ఇరాన్ లో కొత్త చట్టం
మరోవైపు అల్పపీడన ప్రభావం ఉన్నా సరే రాష్ట్రంలో చలి తీవ్రత కనిపిస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం తొమ్మిది గంటల వరకు పాడేరు, పరిసర ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కమ్ముకుంది. ఉదయం 9 తర్వాత మాత్రమే ఏజెన్సీ వాసులు బయటకు వస్తున్నారు. పొగమంచు ప్రభావానికి ఎదురుగా ఉన్న వ్యక్తులు సైతం కనిపించని పరిస్థితి. మంచు దెబ్బకు వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు.