వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. చదవని మెస్సేజ్‌లను గుర్తుచేస్తోందట!

వాట్సాప్ రిమైండర్ అనే అద్దిరిపోయే ఫీచర్‌ను అప్డేట్‌గా తీసుకురానుంది. ఈ ఫీచర్ వాట్సాప్‌లో మీరు చదవకుండా ఉన్న మెస్సేజ్‌లను మీకు గుర్తుచేస్తోంది. త్వరలోనే అందరికీ ఆప్డేట్ అందుబాటులోకి వస్తుంది. రిమైండర్ అప్డేట్ వాట్సాప్ సందేశాలను ట్రాక్ చేస్తోంది.

New Update
whatss

మొబైల్ ఫోన్ వాడేవారు రోజులో ఒక్కసారైనా వాట్సాప్ యూజ్ చేస్తుంటారు. ప్రముఖ టెక్ దిగ్గజం మెటా సంస్థ ఇన్‌స్టాంట్ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ చాలా పాపులర్. వాట్సాప్ అంటే దాదాపు తెలియనివారే ఉండరు.. అంతలా అది ఫేమస్. అయితే యూజర్ ఎంగేజ్‌మెంట్ పెంచడం కోసం వాట్సాప్‌లో ఆ సంస్థ ఎప్పటికప్పుడు ఫీచర్స్ అప్‌డేట్స్ ఇస్తుంది. తాజాగా వాట్సాప్ మరో అద్దిరిపోయే ఫీచర్‌ను అప్డేట్‌గా తీసుకురానుంది. అదే రిమైండర్ ఆప్షన్.

ఇది కూడా చదవండి: ఆన్‌లైన్‌లో స్టిక్కర్లు అమ్మి నెలకు రూ.16 లక్షలు సంపాధిస్తున్న బాలుడు

ప్రస్తుతం ఆ ఫీచర్‌పై టెస్టింగ్ జరుగుతుంది. కొన్ని ఫోన్లకే ఆ ఫీచర్ ఇచ్చింది. మీ ఫోన్ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. త్వరలోనే రిమైండర్ అనే ఆప్షన్‌ను వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ వాట్సాప్‌లో మీరు చదవకుండా ఉన్న మెస్సేజ్‌లను మీకు గుర్తుచేస్తోంది. చాట్‌ బాక్స్‌లో మీ బిజీ షెడ్యూల్ వల్ల రీడ్ చేయని మెస్సేజ్‌ల నోటిఫికేషన్ రూపంలో యూజర్‌కు గుర్తుచేస్తోంది. 

రిమైండర్ ఆప్షన్‌ను ఇలా సెట్ చేసుకోండి.

వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అక్కడ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత అందులో రిమైండర్స్‌ను ఎంచుకొని ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్లను మాత్రమే రిమైండ్ చేసే ఆప్షన్ ఉంది. ఇకముందు మీకు వాట్సాప్‌లో వచ్చిన ఓపెన్ చేయని మెస్సేజ్‌లను కూడా గుర్తు చేయనుంది. రిమైండర్ అప్డేట్ వాట్సాప్ సందేశాలను ట్రాక్ చేస్తోంది.

ఇది కూడా చదవండి : KTR: రేపే అసెంబ్లీ సమావేశాలు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు