రష్యా,ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరుదేశాల్లో భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు మూడేళ్ల నుంచి జరుగుతున్న యుద్ధంలో తాము 43 వేల మంది సైనికులను కోల్పోయామని తెలిపారు. మరో 3.70 లక్షల మందికి పైగా సైనికులు పైగా గాయపడ్డారని పేర్కొన్నారు. తాజాగా డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమైన జెలెన్‌స్కీ.. రష్యా మరోసారి దాడి చేసే అవకాశం లేనివిధంగా శాంతి ఒప్పందం అవసరమని కోరారు.
Also Read: ధరణిలో మార్పులు, కొత్త ఆర్‌వోఆర్ చట్టం.. పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''శాంతికి విఘాతం కలిగించేందుకు రష్యా అనేక ప్రయత్నాలు చేసింది. మాకు న్యాయమైన, శాశ్వతమైన శాంతి కావాలని ట్రంప్‌తో చెప్పాను. గతంలో రష్యా పదేపదే వ్యవహరించినట్లు కాకుండా తన శాంతికి ఎలాంటి విఘాతం కలుగుండా చేసేలా ఈ ఒప్పందం ఉండాలి. ఈ విషయంలో మిత్రదేశాలు గుడ్డిగా ఉండొద్దు. దీర్ఘకాలిక శాంతిని తీసుకొచ్చే ఒప్పందానికి మేము అంగీకరిస్తామని'' జెలెన్స్కీ అన్నారు.
Also Read: CAPF, అస్సాం రైఫిల్స్‌లో 1,00,204 ఉద్యోగ ఖాళీలు..
మరోవైపు ఉక్రెయిన్‌లో వెంటనే కాల్పుల విరమణ అమల్లోకి తీసుకురావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆయన భేటీ అయ్యారు. యుద్ధం వల్ల ఉక్రెయిన్, రష్యాలో వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని, ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయని పేర్కొన్నారు. వెయ్యి రోజులకు పైగా కొనసాగుతున్న ఈ యుద్ధానికి ముగింపు పలకాలని సూచించారు. అలాగే శాంతి ఒప్పందం కోసం జెలెన్స్కీ ఆసక్తిగా ఉన్నారని స్పష్టం చేశారు.
Also Read: ఈవీఎంలపై విపక్షాల అనుమానాలు.. స్పందించిన షిండే !
Also Read: ఆన్‌లైన్‌లో స్టిక్కర్లు అమ్మి నెలకు రూ.16 లక్షలు సంపాధిస్తున్న బాలుడు