Sankranti Special Trains: సికింద్రాబాద్-వైజాగ్ వందేభారత్ కోచ్‌లు భారీగా పెంపు.. సంక్రాంతికి వెళ్లే వారికి పండగే!

సౌత్ సెంట్రల్‌ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని కోచ్‌లను పెంచింది. విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య 20833-20834 నెంబరుగల వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో 20కోచ్‌లు చేసింది.దీంతో 1,440 మంది ప్రయాణికులు వెళ్లొచ్చని తెలిపింది.

New Update
Sankranti 2025 special trains

Sankranti 2025 special trains Vande Bharat train coaches Increase

Sankranthi Special Trains: సంక్రాంతి సందర్భంగా ప్రజలు పలు ప్రాంతాల నుంచి తమ ఊర్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు, ట్రావెల్స్ కిటకిటలాడుతున్నాయి. టికెట్ల కోసం ప్రయాణికులు రాత్రింబవళ్లు రైల్వే స్టేషన్లలోనే గడుపుతున్నారు. కానీ టికెట్లు దొరక్క తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. 

Also Read: నేనూ మనిషినే తప్పులు చేస్తాను దేవుడిని కాదు–ప్రధాని మోదీ

ధరలు ఎంతున్నా కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ట్రైన్లు కరువవ్వడంతో వితిన్ సెకెన్‌లో బుకింగ్స్ ఫుల్ అయిపోతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే ఇప్పటికే చాలా స్పెషల్ ట్రైన్లు వేసింది. అయినా ప్రయాణికుల రద్దీ తగ్గలేదు. దీంతో సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. 

Also Read: మహా కుంభమేళాకు రానున్న స్టీవ్‌జాబ్స్‌ భార్య

మరిన్ని కోచ్‌లు

Also Read: తగలబడుతున్నHollywood.. షూటింగ్ లు బంద్.. స్టార్ నటీనటుల ఇళ్ళు కూడా

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో మరిన్ని కోచ్‌లను యాడ్ చేసింది. (20833-20834) విశాఖపట్నం - సికింద్రాబాద్, అలాగే సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు దాదాపు 1,128 మంది ప్రయాణికుల సామర్థ్యంతో 16 కోచ్‌లతో ప్రయాణిస్తుంది. అయితే ఇప్పుడు మరికొన్ని కోచ్‌లను యాడ్ చేసింది.

Also Read: ఒకవైపు మంచు తుఫాను..మరోవైపు కార్చిచ్చు..అల్లాడిపోతున్న అమెరికా

ఇప్పుడు 1,440 మంది ప్రయాణికుల సామర్థ్యంతో 20 కోచ్‌లను కలిగి ఉంది. ఈ ట్రైన్ రేపటి నుంచి 20 కోచ్‌లతో పట్టాలపై పరుగులు పెట్టనుంది. దీని ద్వారా మరింత మంది ప్రయాణికుల రద్దీ తగ్గుతుందని సౌత్ సెంట్రల్ రైల్వే భావిస్తుంది. ఇది ఒక రకంగా ప్రయాణికులకు శుభవార్తే అని చెప్పాలి. . 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు