Road Accident Tirupati: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు దుర్మరణం

తిరుపతి జిల్లా రేణిగుంట-కడప ప్రధాన రహదారిలోని కుక్కల దొడ్డి వద్ద ప్రైవేటు బస్సు కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు హైదరాబాద్‌లోని పటాన్ చెరువుకు చెందిన సందీప్,అంజలీదేవిగా పోలీసులు గుర్తించారు.

New Update
Road accident tirupathi

Road accident tirupathi

Road Accident Tirupati: తిరుమలలో వరుస ప్రమాదాలు శ్రీవారి భక్తులను భయ బ్రతులకు గురి చేస్తోంది. నిన్నటి ఘటన మరవక ముందు మరో ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌కు చెందిన దంపతులు మృతి చెందారు. వివారాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident Tirupati) చోటుచేసుకుంది. రేణిగుంట-కడప ప్రధాన రహదారిలోని కుక్కల దొడ్డి వద్ద  ప్రైవేటు బస్సు కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. 

Also Read :  ఎంత బరితెగించార్రా : ఛీ.. ఛీ .. స్కూల్లో ఏంటీ పాడు పనులు!

శ్రీవారి దర్శనంకు వెళ్లి వస్తుండగా..

మృతులు హైదరాబాద్‌లోని పటాన్ చెరువుకు చెందిన సందీప్ (45) అంజలీదేవి(40)గా పోలీసులు గుర్తించారు. తిరుమల శ్రీవారి దర్శించుకుని హైదరాబాద్ పోతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న రేణిగుంట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం మొత్తం  నజ్జు నజ్జయింది. శ్రీవారి దర్శనానికి వెళ్లి ఇలా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : హార్ట్‌ బీట్‌, పల్స్‌రేట్‌ మధ్య సంబంధం ఏంటి?

ఈనెల 19న(ఆదివారం) తిరుమల(Tirumala) మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఏడవ మైలు వద్ద డివైడర్ ఢీకొని కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బైక్ స్కిడ్ అయి ఒకరికి గాయాలయ్యాయి. తిరుమల నుండి తిరుపతి(Tirupati) వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై అయిల్ ఎక్కవగా ఉండటంతో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు చుబుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకొని, ప్రమాదాలు జరగకుండా చూడాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. మొదటి ఘాట్‌లో బైక్‌పై ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. రెండు రోజుల్లో రెండు  ప్రమాదాలు జరటంతోపాటు భక్తుల్లో భయం పట్టుకుంది. ఈ సమస్యలు పరిష్కారం చూడాలని వేడుకుంటున్నారు. దేవుని దర్శనం కోసం వెళ్తె ఇలా ప్రాణాలు కోల్పోవటంపై భక్తుల్లో కొంత నిరుత్సాహం వస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read :  మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ పదేళ్ల నాగసాధు...!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు