PM Modi: ఇది నూతన, చరిత్రాత్మక అధ్యాయం.. చంద్రబాబును పొగుడుతూ మోదీ పోస్ట్!

అమరావతి పునఃప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఇది నూతన, చారిత్రాత్మక అధ్యాయం అంటూ పోస్ట్ పెట్టారు. అమరావతి గొప్ప పట్టణ కేంద్రంగా ఆవిర్భవిస్తుందని, చంద్రబాబు దార్శనికత, నిబద్ధతను అభినందించారు. 

New Update
PM Modi

PM Modi

PM Modi: అమరావతి పునఃప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబుపై(CM Chandrababu) ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఇది నూతన, చారిత్రాత్మక అధ్యాయం అంటూ సోషల్ మీడియా వేదికగా పొగిడేశారు. ‘అమరావతి అభివృద్ధిలో నూతన, చరిత్రాత్మక అధ్యాయ ప్రారంభోత్సవంతో ఏపీలోని నా సోదర, సోదరీమణుల మధ్య ఉండటం చాలా సంతోషంగా ఉంది. అమరావతి గొప్ప పట్టణ కేంద్రంగా ఆవిర్భవిస్తుంది. ఇది ఏపీ అభివృద్ధి పథాన్ని మెరుగుపరుస్తుందని నేను బలంగా విశ్వసిస్తున్నా. నా మిత్రుడు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతి పట్ల ఉన్న దార్శనికత, ప్రజల సంక్షేమం పట్ల నిబద్ధతను నేనే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’ అని చెప్పారు. 

Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

అమరావతి అంటే శక్తి..

ఈ మేరకు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. అమరావతి స్వప్నం సహకారం అవుతున్నట్లు కనిపిస్తోందని ప్రధాని అన్నారు. ఒక కొత్త అమరావతి.. కొత్త ఆంధ్రప్రదేశ్ అని మోదీ నినాదం ఇచ్చారు. అమరావతి ఒక నగరం కాదు.. అమరావతి అంటే శక్తి అని మోదీ చెప్పారు. బౌద్ద వారసత్వం, ప్రగతి కలగలిసిన ప్రాంతం ఇది అన్నారు. ప్రస్తుతం ఆయన పుణ్య భూమిపై నిలబడి ఉన్ననని అన్నారు. ఇది కేవలం శంకుస్థాపన కాదు, ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్‌కు నిదర్శనం అని ప్రధాని అన్నారు. ఏపీ అంటే ఆధునిక ప్రదేశ్ అని ఆయన అన్నారు.

Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

chandrababau | amaravathi | telugu-news | today telugu news 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు