లేడీస్ హాస్టల్‌లో నగ్న పూజలు.. చివరి ఏమైందో తెలుసా..?
పెద్దపల్లి జిల్లా మంథనిలో కలకలం చోటుచేసుకుంది. ప్రభుత్వ హాస్టల్ హాస్టల్‌లోని వంట మనిషి బాలికను మచ్చిక చేసుకొని నగ్న పూజలకు యత్నించింది. బాలిక ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులుకు ఫిర్యాదు చేయగా.. వంటమనిషి పై ఫోక్సో కేసు నమోదు చేశారు.
Peddapalli: పెద్దపల్లి జిల్లా మంథని మండలం బాలికల ప్రభుత్వ హాస్టల్‌లో కలకలం చోటుచేసుకుంది. హాస్టల్ లోని వంటమనిషి బాలికకు మాయమాటలు చెప్పి నగ్న పూజలకు యత్నించింది. తన మాయమాటలతో బాలికను మచ్చిక చేసుకున్న వంటమనిషి.. నగ్న పూజలు చేస్తే డబ్బుల వస్తాయని ఒప్పించింది. హాస్టల్ లోని తన పర్సనల్ రూంకు ఓ వ్యక్తిని తీసుకొచ్చి బాలికతో నగ్న పూజలు చేసేందుకు ప్లాన్ చేసింది. దీంతో భయపడిపోయిన బాలిక హాస్టల్ నుంచి వెళ్ళిపోయి మంథనిలోని తమ బంధువుల ఇంట్లో తలదాచుకుంది. ఆ తర్వాత బాలిక ద్వారా విషయం తెలియడంతో.. కుటుంబ సభ్యులు వంటమనిషిని నిలదీశారు. దీంతో అసలు నిజం బయటపడింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వంట మనిషిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఇది ఇలా ఉంటే గతంలో కడప జిల్లాలో ఓ పూజారి నగ్నపూజలు చేస్తూ దొరికిపోయాడు. నగ్నపూజలు చేస్తే డబ్బులు వస్తాయంటూ యువతులను ట్రాప్ చేశాడు. యువతులతో నగ్నపూజలు చేసిన పూజారి.. అనంతరం వారిని బెదిరింపులకు గురి చేశాడు. యువతులు చెప్పిన పని చేయకపోతే వీడియోలు వైరల్ చేస్తామని వేధింపులకు గురిచేశాడు. ఇదంతా గుర్తించిన పోలీసులు ఈ వ్యవహారంలో ఆరుగురిని అరెస్ట్ చేశారు.అయితే పొద్దుటూరుకు చెందిన ముఠా సభ్యులు ఈ పూజలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్షుద్రపూజలో ఆరుగురు పురుషుల్లో ఒక పూజారి తాడిపత్రి, తిరుపతికి చెందిన వారు ఉన్నారు. నగ్న పూజలు చేస్తున్న పూజారి సహా పదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.