/rtv/media/media_files/2024/10/16/hldhY9G2PzS7POPsClQ7.jpg)
Maharastra New CM: మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు అనే దానిపై జరుగుతున్న చర్చకు తెర పడింది. బీజేపీ నేత ఫడ్నవీస్ ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సీఎం పదవికి రాజీనామా చేసేందుకు ఏక్‌నాథ్ షిండే రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. కాగా నేటితో మహారాష్ట్ర ప్రభుత్వ గడువు ముగియడంతో షిండే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏక్‌నాథ్ షిండే వెంట ఫడ్నవిస్, అజిత్ పవర్ ఉన్నారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
Maharashtra Chief Minister Eknath Shinde resigned from his post and the Governor appointed him as caretaker Chief Minister until the next government is sworn in.
— ANI (@ANI) November 26, 2024
(Source: Raj Bhavan) pic.twitter.com/uKVvHbxOWz
'మహా' కింగ్ అతడే?
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడిన నిమిషం నుంచి నెక్స్ట్ సీఎం ఎవరు అనే చర్చ జోరుగా సాగింది. షిండే, ఫడ్నవిస్, అజిత్ పవర్ ఈ ముగ్గురిలో ఎవరు సీఎం పీఠాన్ని దక్కించుకుంటారనే దానికి షిండే తెర దింపారనే చెప్పారు. ఈరోజు ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఒకవేళ షిండే సీఎంగా కొనసాగాలి అనుకుంటే సీఎం పదవికి రాజీనామా చేయకుండా.. సీఎం బాధ్యతలు స్వీకరించే వారు. సీఎం పదవికి రాజీనామా తో షిండే సీఎం రేసు నుంచి తప్పుకున్నట్లు క్లియర్ అయింది. కాగా ఇప్పుడు సీఎం రేసులో ఇద్దరు నేతలు ఉన్నారు. బీజేపీ నుంచి ఫడ్నవిస్, NCP నుంచి అజిత్ పవర్ సీఎం కుర్చీ కోసం పోటీ పడుతున్నారు. అయితే ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు కమలం పార్టీ దక్కించుకోవడంతో.. సీఎం పదవి కూడా బీజేపీకి నాటే ఫడ్నవిస్ కు దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం. దీనిపై ఈరోజు క్లారిటీ రానుంది.
త్యాగానికి తగిన గుర్తింపు..!
మహారాష్ట్రలో కమలం పార్టీకి ప్రభుత్వాన్ని అప్పగించేందుకు సీఎం కుర్చీని వదులుకున్న ఏక్‌నాథ్ షిండేకు ఏ పదవి దక్కుతుందనే చర్చ జోరందుకుంది. షిండే సీఎం రేసు నుంచి తప్పుకోవడంపై నిరాశ చెందిన శివసేన కార్యకర్తలు.. షిండేకు పవర్ ఫుల్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే షిండే కు డిప్యూటీ సీఎం పదవి లేదా కేంద్రంలో చక్రం తిప్పేందుకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనలో కమలనాథులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం పదవి రేసులో అజిత్ పవర్ కూడా ఉన్నట్లు సమాచారం. కాగా ఇప్పుడు బీజేపీకి ఇదే పెద్ద తలనొప్పిగా మారింది. మరి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.