ఏపీ డిప్యూటీ సీఎం వైసీపీ అధినేత జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాం కేసులో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ వ్యవహారంపై ప్రభుత్వం చట్టప్రకారం ముందుకెళ్తోందని తెలిపారు. ఈ కేసులో ఎంతటివారున్నా వదిలేదు లేదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ చర్యల్లో కక్షసాధింపు ఏమీలేదని ఆయన చెప్పారు.
ఏపీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తు సిట్ అధికారులు ముమ్మరం చేశారు. ఈక్రమంలోనే ఏంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచారు. ఆయనకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే ఈకేసులో ఆయన ఏ4గా ఉన్న ఉన్నారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో మిథున్‌రెడ్డిని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.