/rtv/media/media_files/2025/11/18/women-2025-11-18-07-36-34.jpg)
కుటుంబాన్ని పోషించడానికి, ఆర్థిక ఇబ్బందులను తీర్చుకోవడానికి పరిచయస్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికి వచ్చిన హోంగార్డు మహిళ (39) ఆ నలుగురి నీచపు కుట్రకు బలైంది. కొప్పళ జిల్లా యెల్బుర్గా తాలూకా మాద్లూర్ సమీపంలో ఆదివారం రాత్రి ఈ హేయమైన సామూహిక అత్యాచారం జరిగింది.
ప్రస్తుతం ఆ మహిళ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
https://t.co/P6nuIOTgqTpic.twitter.com/LCwmIARHk0
— ಪ್ರಸ್ತುತ - Prasthutha (@PrasthuthaNews) November 17, 2025
జ్యూసులో మద్యం కలిపి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తనకు పరిచయం ఉన్న వారిని ఆర్థిక సహకారం కోరేందుకు హొసపేటె నుంచి కుష్ఠగికి ఆదివారం సాయంత్రం బాధితురాలు చేరుకుంది. ఆమెను నమ్మించి, తీసుకెళ్లిన దుండగులు జ్యూసులో మద్యం కలిపి ఇచ్చారు. అనంతరం నలుగురూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి ఆమెను స్థానికులు కొందరు చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ బాధితురాలు మృత్యువుతోత పోరాడుతుంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నిందుతులైన లక్ష్మణ కెంచప్ప కెరగుళి, బవసరాజ సక్రెప్ప, భీమప్ప మస్కి, శశికుమార్ అనే వ్యక్తులను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. యెల్బుర్గా పోలీస్ స్టేషన్‌లో BNS 2023 సెక్షన్ 115(2), 70, 351 (2), 3(5) కింద కేసు నమోదు చేశారు.
రూ. 5,000 ఇవ్వాలని అనుకుని
"నిందితులకు ఆ మహిళతో పరిచయం ఉందని, ఆమెకు రూ. 5,000 ఇవ్వాలని అనుకున్నారని మాకు తెలిసింది. డబ్బు తీసుకోవడానికి కుష్టగికి రమ్మని చెప్పారు. ఆమె వచ్చినప్పుడు, అతను ఆమెను బైక్‌పై తీసుకెళ్లి, జ్యూస్ లో మద్యం కలిపారు. తరువాత వారు ఈ నేరానికి పాల్పడ్డారు" అని పోలీసులు తెలిపారు.డీఎస్పీ ముత్తన్న సారవగోల్ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
Follow Us