Arava Sreedhar: పెళ్లి చేసుకుంటా..విడాకులు ఇచ్చేయ్‌..వెలుగులోకి జనసేన ఎమ్మెల్యే కీచక పర్వం

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్ పరిచయం ఆసరాగా మహిళా ఉద్యోగిని శ్రీధర్‌ వేధింపులకు గురిచేసినట్లు ఆమె ఆరోపించింది. దానికి సంబంధించిన వీడియోలు విడుదల చేసింది.

New Update
FotoJet (27)

Jana Sena MLA's scandal comes

Arava Sreedhar :  ఏపీకి చెందిన జనసేన ఎమ్మెల్యే(janasena-mla) కీచకపర్వం వెలుగులోకి రావడంతో కూటమి ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు(Railway Kodur) నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్ పరిచయం ఆసరాగా మహిళా ఉద్యోగిని శ్రీధర్‌ వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగం పేరుతో ఓ మహిళను ఏడాదిన్న కాలంగా బెదిరిస్తూ వచ్చాడు. అంతేకాదు ఆమెను లోబర్చుకోవడంతో పాటు ఏడాదిన్నరగా ఆమెపై అత్చాచారం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లోబర్చుకున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గర్భవతి కావడంతో ఆమెకు అబార్షన్‌ చేయించినట్లు తెలుస్తోంది.

కోరిక తీర్చాలని వేధిస్తూ(sex-scandal-case) తరచూ ఎమ్మెల్యే ఫోన్ కాల్స్ చేస్తున్నాడని సదరు మహిళా ఆరోపిస్తుంది. కోరిక తీర్చకపోతే మూడేళ్ల కుమారుడిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపించింది. భర్తకు విడాకులు ఇవ్వాలంటూ సదరు మహిళను వేధించడంతో పాటు బాధిత మహిళ భర్తకు కూడా ఫోన్ చేసి ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Also Read :  సత్యసాయి జిల్లాలో ఘోరం.. వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి, బిడ్డ దుర్మరణం

Jana Sena MLA's Sex Scandal Case

బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన అరవ శ్రీధర్‌ ఆమె భర్తకు విడాకులు ఇవ్వాలని హుకుం జారీ చేశాడు. పెళ్లి చేసుకుంటానని బలవంతం చేశాడు. అందుకు ఒప్పుకోకపోవడంతో ఆమె భర్తకు ఫోన్‌ చేసి బెదిరించాడు. దీంతో బాధితురాలికి ఆమె భర్తకు విభేదాలు తలెత్తినట్లు ఆ మహిళా వాపోయింది. భర్తకు విడాకులు ఇవ్వాలని.. తాను ఎమ్మెల్యేనని చెప్పింది చేయాల్సిందేనని పట్టుబడట్టాడు. లేదంటే బాధిత మహిళ మూడేళ్ల కుమారుడి ప్రాణం తీస్తానని హెచ్చరించాడు. ఇలా ఏడాదిన్నర కాలంగా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ ఆగడాలు తట్టుకోలేని మహిళ తాజాగా, వీడియోలు, వాట్సాప్‌ చాట్‌లతో సహా బయట పెట్టడం కలకలం రేపింది.  

ఆ మహిళా ఉద్యోగికి ఇదివరకే పెళ్లయి మూడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఉద్యోగ రీత్యా భర్త హైదరాబాద్‌లో ఉంటుండగా అతడికి కూడా ఫోన్లు చేసి బెదిరించారట అరవ శ్రీధర్. మొత్తానికి ఇప్పుడా మహిళా ఉద్యోగిని ఏకాకిని చేశారు. భర్త దూరమైపోయాడు, కొడుకును కూడా తీసుకొని వెళ్లిపోయాడు. అలా అని అరవ శ్రీధర్ ఆమెను పెళ్లి చేసుకున్నారా అంటే అది కూడా లేదు. ఏడాదిన్నరగా పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి, శారీరకంగా లోబరుచుకొని, తాజాగా పెళ్లి చేసుకోనని మొహంమీద చెప్పేశారంట. దీంతో గత్యంతరం లేక మీడియాకెక్కింది ఆ మహిళ. తనను శ్రీధర్, ఎంతలా టార్చర్ చేశారో చెప్పుకొచ్చింది. బదిలీ చేయించుకొని ఎటన్న వెళ్లిపోదామన్నా కూడా ఆమె వల్ల కాలేదు. దీంతో భరించలేక ఎమ్మెల్యే బాగోతం మొత్తాన్ని వాట్సాప్ ఛాట్స్, వీడియోల రూపంలో ఆమె బయటపెట్టింది. ఓ వీడియోలో బట్టల్లేకుండా, ఒంటిపై నూలుపోగు లేకుండా శ్రీధర్ ‘నిజరూపం’ దర్శనమివ్వడంతో జనసేన నేతలు తలలు పట్టుకుంటున్నారు. కాగా ఎమ్మె్ల్యే విషయంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Also Read :  కావేరి ట్రావెల్స్ బస్సుకు తప్పిన ఘోర ప్రమాదం

Advertisment
తాజా కథనాలు