BIG BREAKING: కావేరి ట్రావెల్స్ బస్సుకు తప్పిన ఘోర ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. పాండిచేరి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వి. కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు టిడ్కో హౌస్ సమీపంలో బస్సు అదుపుతప్పి ఢీవైడర్‌‌ని ఢీకొట్టి.. రాంగ్ రూట్‌లోకి వెళ్లింది.

New Update
bus accident (1)

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పాండిచేరి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కే.కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు టిడ్కో హౌస్ దగ్గర బస్సు అదుపుతప్పి ఢీవైడర్‌‌ని ఢీకొట్టింది. బస్సు మితిమీరిన వేగం కారణంగా రాంగ్ రూట్‌లోకి వెళ్లింది. అదే సమయంలో ఎదురుగా మరో వాహనం రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో 29 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఈ కావేరి ట్రావెల్స్ బస్సు ఎవరికీ ఏం కాకపోవడంతో ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు. మరో బస్సులో ప్రయాణీకులను తరలించారు. సమాచారం తెలియడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు.

Advertisment
తాజా కథనాలు