Lightning: ప్రాణాలు తీస్తున్న పిడుగులు..

ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులు ప్రాణాలు తీస్తున్నాయి. అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల పిడుగులు పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో పిడుగుల పడి 30 గొర్రెలు మృతి చెందగా, విశాఖలో ఆయిల్ కంపెనీపై పిడుగు పడి మంటలు చెలరేగాయి.

New Update
Lightning is taking lives

Lightning is taking lives

Lightning : ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులు ప్రాణాలు తీస్తున్నాయి. అకాల వర్షాలు, అనుకోని కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల పిడుగులు పడుతున్నాయి.  ఈ విషయంలో  వాతావరణశాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ పలు చోట్ల పిడుగులు పడి ప్రాణాలు పోతూనే ఉన్నాయి. పిడుగుల దాటికి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పిట్టలు.. ఇలా ఎన్ని చనిపోతున్నాయో లెక్కేలేదు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గ‌డిచిన ఐదేళ్లలో పిడుగుపాటుతో 570 మంది మృతిచెందినట్టు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. తాజాగా భారీవర్షాల నేపథ్యంలో మరోసారి పలు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి.

Also Read : SEAL Team 6 Mission: ఉత్తర కొరియాలో ట్రంప్ సీల్ టీమ్...పౌరుల మృతితో ఫెయిల్

30 గొర్రెలు మృతి..

విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో  వర్షపునీరు చేరి ఇబ్బందులకు గురి చేసింది. వర్షాల మూలంగా పిడుగు పడి వేపాడ మండలం కొండగంగుపూడిలో 30 గొర్రెలు మృతి చెందాయి. అలాగే ఎస్‌.కోట మండలం మునుపురాయిలో ముగ్గురికి గాయాలయ్యాయి. గ్రామంలోని  ఒక ఇంటికి సమీపంలోనే పిడుగు పడటంతో సిబోయిన రుద్రమ్మ, కుమారుడు కన్నయ్య, కోడలు బిమ్మాలమ్మకి గాయాలవ్వడంతో వారిని చికిత్స కోసం ఎస్‌.కోట ఆసపత్రికి తరలించారు.

ఇది కూడా చూడండి:Ganesh Nimajjanam 2025: వినాయక నిమజ్జనాల్లో అపశ్రుతి.. క్రేన్ తెగి పడి ఇద్దరు.. నీటిలో కొట్టుకుపోయి మరికొరు..!

ఆయిల్‌ కంపెనీపై పిడుగు పడి...

విశాఖ నగరంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నగరంలోని ఈస్ట్‌ఇండియా కంపెనీకి చెందిన పెట్రోలియం కంపెనీపై ఆదివారం పిడుగు పడింది. కంపెనీలోని పెట్రోల్‌ ఫిల్టర్‌ ట్యాంక్‌పై పిడుగు పడటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. విశాఖలో అగ్నిప్రమాద ఘటనపై  హోం మంత్రి అనిత ఆరా తీశారు. అగ్నిమాపకశాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు.

Also Read: మరో రెండు నెలలో భారత్ క్షమాపణలు చెబుతుంది..యూఎస్ కామర్స్ సెక్రటరీ నోటి దురద

Advertisment
తాజా కథనాలు