Aghori - Sri Varshini: అఘోరీకి దిమ్మతిరిగే షాక్.. 10 ఏళ్లు జైల్లోనే - లాయర్ సంచలన వ్యాఖ్యలు

లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీని అనంతరం అఘోరీ కోసం కోర్టు నియమించిన లాయర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అఘోరీ తప్పు చేసినట్లు రుజువైతే 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని అన్నారు.

New Update

అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌కు బిగ్ షాక్ తగిలింది. అతడిని అరెస్టు చేసి చేవెళ్ల కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు అఘోరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అఘోరీని సంగారెడ్డి సబ్ జైలుకు (కంది జైలు) తరలించారు. కోర్టులో విచారణ అనంతరం అఘోరీ తరఫు లాయర్ సంచలన విషయాలు బయటపెట్టారు. కోర్టులో ఎలాంటి వాదనలు జరగలేదని ఆయన అన్నారు. కోర్టు తరపున అడ్వకేట్‌ను పెట్టుకునే స్థోమత లేనివారికి కోర్టు తనను అపాయింట్ చేయడం జరిగిందని లాయర్ అన్నారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

10 ఏళ్ల వరకు శిక్ష

కేసు పూర్వపరాలు పరిశీలించిన తర్వాత బెయిల్ వస్తాదా? రాదా ? అనేది తెలుస్తుందని ఆయన అన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని.. తప్పు చేసిన వారు కచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదు అని చెప్పుకొచ్చారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించడం చాలా తప్పు అని.. ఒకవేళ అఘోరీ చేసింది తప్పు అని నిర్దారణ అయిన తర్వాత శిక్ష కచ్చితంగా పడుతుందని అన్నారు. ఒకేవేళ అఘోరీ తప్పు చేసినట్లు రుజువు అయితే 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

లింగ నిర్ధారణ పరీక్షలు

చీటింగ్ కేసులో అరెస్టైన అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు  తరలించే అవకాశం ఉంది. 

aghori | aghori Arrest | aghori sri varshini | Lady Aghori Sri Varshini | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు