/rtv/media/media_files/2025/05/19/VJlyzQAkS9JwC0dOjEQG.jpg)
Janasena and TDP war in Visakhapatnam
AP Politics: విశాఖలో జనసేన, టీడీపీ వర్గాల మధ్య విభేధాలు భగ్గుమన్నాయి. డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయించడంపై టీడీపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సమన్వయ సమావేశం నుంచి కాపు, యాదవ సామాజిక వర్గాలకు చెందిన కార్పొరేటర్లు అలిగి వెళ్లిపోగా ఎన్నిక రేపటికి వాయిదా పడింది.
ఆ ఇద్దరు డుమ్మా..
ఈ మేరకు డిప్యూటీ మేయర్ ఎన్నికకు టీడీపీ కార్పొరేటర్లు హాజరుకాకపోవడంతో కోరం సరిపోలేదు. ఈ క్రమంలోనే ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్నికకు కావాల్సిన సంఖ్యాబలం 56. కానీ 54 మంది హాజరుకావడంతో ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేశారు.
Also Read : ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ప్రారంభించిన సీఎం.. 2.30 లక్షల రైతులకు పోడుపట్టాలు మంజూరు!
ఇక అలకబూనిన కౌన్సిలర్లతో టీడీపీ అధిష్టానం చర్చించే అవకాశం ఉంది. ఇక ఈ వివాదంపై జీవీఎంసీ డిప్యూటీ మేయర్ సతీష్ మాట్లాడుతూ.. విశాఖ అభివృద్ధిపై కూటమికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఆ నేతల మధ్య సమన్వయ లోపం ఉందని, మేయర్ ఎన్నికకు కోరం సభ్యులు కూడా రాకపోవడం దారుణం అన్నారు.
Also Read : పహల్గాం ఎఫెక్ట్.. ఆసియా కప్ నుంచి భారత్ ఔట్