Ap: ఏపీలో కొత్త రైలు మార్గంలో.. కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటైంది. నడికుడి- శ్రీకాళహస్తి మార్గంలో ప్రకాశం జిల్లా కీలకంగా మారింది. ముఖ్యంగా దర్శి, పొదిలి, కనిగిరి ప్రాంతాల్లో రైల్వే లైన్ కోసం ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.నేటితో వారి కల తీరింది. దర్శిలో కొత్తగా రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయగా.. రైళ్ల రాకపోకల కోసం ట్రయల్ రన్ వేస్తున్నారు. మళ్లీ చాలా రోజుల తర్వాత కొత్త రైల్వే స్టేషన్‌కు ప్యాసింజర్ రైలు వచ్చి ఆగింది. Also Read: Ap: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త..రేపటి నుంచే ఆ పథకం అమలు! మరోసారి దర్శికి చాలాకాలం తరువాత ప్యాసింజర్ రైలు రావడంతో ఆ ప్రాంత ప్రజల ఆనంద పడుతున్నారు. దర్శిలో తాజాగా ప్యాసింజర్ రైలుతో అధికారులు ట్రయల్ రన్ వేశారు. ఈ మేరకు రైల్వే అధికారులు, సిబ్బంది, ప్రయాణికులతో రైలు దర్శి స్టేషన్‌కు చేరింది. దీంతో ఈ రైలును చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈక్రమంలోనే పొదిలి మండలం మల్లవరం వరకు జరిగిన కొత్త రైల్వే లైన్ పనులను అధికారులు పరిశీలిస్తారు. Also Read: Plane Crash: కుప్ప కూలిన మరో విమానం.. ఇద్దరు మృతి.. 18 మందికి సీరియస్ ట్రయల్ రన్ కూడా... అయితే కోర్టులో కేసుల కారణంగా పొదిలి సమీపంలో కొంత దూరం మేర పనులు ఆగిపోయాయి.. ఆ కేసులు కూడా క్లియర్ అయితే పొదిలి వరకు రైలును నడిపేందుకు అధికారులు సిద్దంగా ఉన్నారు. రైల్వే అధికారులు నడికుడి- శ్రీకాళహస్తి లైన్ పనుల్లో వేగాన్నిపెంచారు. ఈ కొత్త రైలు మార్గంలో నడికుడి నుంచి పల్నాడు జిల్లా శావల్యాపురం వరకు పనులను అధికారుల పూర్తి చేశారు. ట్రయల్ రన్ కూడా సక్సెస్ అయ్యింది. Also Read: Amith Shah:కశ్మీర్ పేరు మార్పు? ఋషి కశ్యప్ పెట్టొచ్చని అన్న అమిత్ షా ప్రస్తుతానికి దర్శి వరకు రైళ్లు నడిచేందుకు లైన్ క్లియర్ అయ్యింది. త్వరలోనే పొదిలికి కూడా రైళ్లు పరుగులు పెట్టనున్నట్లు సమాచారం. ఆ తర్వాత కనిగిరి వరకు ట్రాక్ ఏర్పాటు అవ్వనుంది. Also Read: Delhi: వణుకుతున్న ఉత్తరాది..విమానాలు, రైల్వే సర్వీసుల పై ఎఫెక్ట్!