Ap: ఏపీ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు ఓ అదిరిపోయే శుభవార్తను చెప్పింది. కొత్త సంవత్సరం వేళ ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు రెడీ అయ్యింది. ఈ నెల 4 నుంచి ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ ప్రారంభించనున్నట్లు అధికారులు ప్రకటించారు. శనివారం విజయవాడ నగరం పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యా శాఖ మంత్రి లోకేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
Also Read: Norovirus: అమెరికాలో విజృంభిస్తున్న కొత్త వైరస్.. భారీగా కేసులు
ఈ మేరకు ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. జూనియర్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న వేదికతో పాటూ ఇతర ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ మేరకు అధికారులకు పలు కీలక సూచనలు ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ ఈ పథకం ప్రారంభించిన తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులతో లోకేశ్ వర్చువల్‌గా మాట్లాడనున్నారు.
Also Read: Syria:సిరియా మాజీ అధ్యక్షుడు అసద్ కు సీరియస్..విష ప్రయోగం అని అనుమానం
ప్రభుత్వ పాఠశాలల్లో మెనూయే..
అనంతరం అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారు. ఈ ఏర్పాట్లను పరిశీలించిన వారిలో 'ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృతికా శుక్లా, సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, విజయవాడ మున్సిపల్ కమిషనర్ హెచ్.ఎం.ధ్యానచంద్రలు' ఉన్నారు. వాస్తవానికి ఈ పథకాన్ని ఈరోజు నుంచే అమలు చేయాలనుకున్నారు. కొన్ని కారణాలతో నాలుగో తేదీకి వాయిదా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మెనూయే జూనియర్ కాలేజీల్లోనూ అమలు చేస్తారు.
Also Read: Ap Cm Chandra Babu Naidu: విశాఖ, విజయవాడలో మెట్రో రైళ్లు.. ఆ మార్గాల్లో అయితే డబుల్ డెక్కర్ నే
ఏపీ ప్రభుత్వం ఇటీవల డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మెనూలో మార్పులు చేసింది. ఈ మేరకు మధ్యాహ్న భోజనం మెనూను జోన్లవారీగా అమలు చేస్తారని సమాచారం. ఆ జిల్లాల్లో ఆహార అలవాట్లను బట్టి నాలుగు జోన్లుగా మెనూను నిర్ణయించారు. అంతేకాదు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులకు సంబంధించి భోజనంలో చిన్న చిన్న మార్పులు కూడా చేశారు.
Also Read: Karnataka: ఉచిత బస్ ఎఫెక్ట్..అక్కడ 15 శాతం పెరిగిన ఛార్జీలు..మరి మన సంగతేంటో!
ఈ మేరకు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్, మిడ్ డే మీల్స్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం మెనూలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 'శనివారం ఆకు కూర అన్నం పప్పుచారు, స్వీట్ పొంగల్, రాగిజావ' ఇస్తారు. 'మిగిలిన రోజులలో రైస్, సాంబార్, వెజిటేబుల్ కర్రీ , స్వీట్ పొంగల్, రాగిజావ' ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు మెనూ అమలు చేయాలని అధికారుల్ని ఆదేశించారు.