AP: చంద్రబాబు కీలక నిర్ణయం.. ఏపీ కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా!

ఏపీ కొత్త డీజీపీ ఎవరనే  చర్చ జోరుగా నడుస్తోంది. నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.  1992 బ్యాచ్‌కు చెందిన హరీష్‌ కుమార్‌ గుప్తా ప్రస్తుతం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా  ఉన్నారు.

New Update
harish kumar gupta

harish kumar gupta Photograph: (harish kumar gupta)

ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ దగ్గర పడుతుండటంతో కొత్త డీజీపీ (DGP) ఎవరనే  చర్చ జోరుగా నడుస్తోంది.  నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా (Harish Kumar Gupta) నియమితులయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.  1992 బ్యాచ్‌కు చెందిన హరీష్‌ కుమార్‌ గుప్తా ప్రస్తుతం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా  ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో హరీష్‌ గుప్తాను ఎన్నికల సంఘం డీజీపీగా నియమించింది. దీంతో కొన్నిరోజుల పాటు ఆయన ఆ పోస్టులో కొనసాగారు. 

Also Read :  భారత ఐటీకి ఏం కాదు..నాస్కామ్

రాజకీయ ఆరోపణల నేపథ్యంలో అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఈసీ బదిలీ చేసింది. ఆయన స్థానంలో హరీష్‌ కుమార్ గుప్తాను ఎంపిక చేసింది. సీనియార్టీలో ద్వారకా తిరుమల రావు, హరీశ్ కుమార్ గుప్తా, మాదిరెడ్డి ప్రతాప్ ల పేర్లను  అప్పటి ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఈసీకి సూచించారు. ఇందులో సీనియర్ ఐపీఎస్, 1992 బ్యాచ్ కు చెందిన హరీశ్ కుమార్ గుప్తా పేరును ఈసీ డీజీపీగా ఎంపిక చేసింది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన హరీష్‌ కుమార్‌ ఏపీ క్యాడర్‌కు ఎంపికయ్యారు.

Also Read :  రూ. 1000 పెట్టుబడితో రూ.11 కోట్లు.. మీ పిల్లలు కోటీశ్వరులు కావడం ఖాయం!

సీనియారిటీ  లిస్టులో మాదిరెడ్డి ప్రతాప్‌

ఆ తరువాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (NDA Government) అధికారంలోకి వచ్చాక తిరుమలరావును డీజీపీగా నియమించింది.  ఈయన  పదవీ విరమణ అయ్యాక సీనియారిటీ  లిస్టులో 1991 బ్యాచ్‌కు చెందిన అగ్నిమాపకశాఖ డైరెక్టర్‌ జనరల్‌ మాదిరెడ్డి ప్రతాప్‌ మొదటి స్థానంలోఉండగా..  హరీష్‌ కుమార్ గుప్తా రెండో స్థానంలో ఉన్నారు.  ప్రస్తుత డీజీపీ పదివి కాలాన్ని పొడిగించడంపై యూపీఎస్సీకి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదన పంపకపోవడంతో కొత్త డీజీపీ ఎంపిక అనివార్యం కానుంది. సీఎం చంద్రబాబు (Chandrababu) దావోస్ టూర్‌ ముగిసిన తరువాత డీజీపీ ఎంపిక విషయంపై  ఓ క్లారిటీ రానుంది.  

పెట్టుబడిదారుల దృష్టి ఆకర్షించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని బృందం దావోస్‌కు పర్యటన చేపట్టింది.  జనవరి 20వ తేదీ నుంచి 2 4 వరకూ సాగే ఈ పర్యటనలో దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ అవుతారు.  సీఎం చంద్రబాబు వెంట ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌, పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్‌, ఈడీబీ అధికారులు వెళ్లారు.  

Also Read :  మహాకుంభమేళాకు ముస్లిం వ్యక్తి... రుద్రాక్ష ధరించి త్రివేణి సంగమంలో స్నానం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు