AP DGP: ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించారు. హరీష్ కుమార్ గుప్తా 1992 ఐపీఎస్ బ్యాచ్. హోం శాఖ కార్యదర్శిగా ఉన్న ఈయన.. ఈసీ ఆదేశాల మేరకు డీజీపీగా నియమితులయ్యారు.