/rtv/media/media_files/2025/01/23/njnU2SASJwwG8zCxhvYi.jpg)
mahakumbh-mela, muslim man Photograph: (mahakumbh-mela, muslim man )
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటి వరకు 8.5 కోట్ల మందికి పైగా భక్తులు పవిత్ర సంగమంలో స్నానాలు చేశారు. 45 రోజులపాటు సాగే ఈ మహాకుంభమేళాకు దాదాపుగా 40 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మహాకుంభమేళాకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు యూపీ సర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది.
అయితే ఈ మహాకుంభమేళాకు ముస్లిం మతానికి చెందిన ఓ వ్యక్తి స్నానం ఆచరించాడు. అతని పేరు షేక్ రఫీక్. ఒడిశా నుంచి మహాకుంభమేళాకు వచ్చాడు. ఒరిస్సాలోని బాలాసోర్ జిల్లాకు చెందిన షేక్ రఫీక్ ఓ టీ స్టాల్ నడిపిస్తున్నాడు. అక్కడికి వచ్చిన వాళ్లంతా.. మహాకుంభమేళా గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటే వినేవాడు. దీంతో ఎలాగైనా మహాకుంభమేళాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కుటుంబసభ్యులతో మాట్లాడి ఇక్కడికి చేరుకున్నారు.
Also Read : బంపరాఫర్ : మెట్రో కీలక నిర్ణయం.. మ్యాచ్ టికెట్ ఉంటే చాలంతే!
దేవుడు ఒక్కడే అని తాను నమ్ముతానని షేక్ రఫీక్ అంటున్నాడు. ఇక్కడి వచ్చి స్నానం ఆచరించడం తన అదృష్టంగా భావిస్తున్నాని తెలిపాడు. గత మూడు రోజులుగా షేక్ రఫీక్ త్రివేణిలో స్నానం చేస్తున్నాడు. అక్కడి వస్తున్న భక్తుల మెడలో రుద్రాక్షి పూసలు చూసినప్పుడు తాను కూడా ఒకటి కొని ధరించానని చెబుతున్నాడు. రఫీక్ వెంట తన భార్య, ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. కుటుంబమంతా గత మూడు రోజులుగా త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారు.
జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. మహాకుంభంలో స్నానం చేయడం వలన చేసిన పాపాలన్నీ తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. మహాకుంభమేళా ప్రారంభమైన మొదటిరోజే ఏకంగా 50 లక్షల మందికి పైగా ప్రజలు మొదటి పవిత్ర స్నానం చేశారు. ఈ ఈ కార్యక్రమానికి యూపీ ప్రభుత్వం రూ. 7 వేలు కోట్ల బడ్జెట్ కేటాయించింది.
Also Read : Horoscope Today: నేడు ఈ 2 రాశులవారికి మనోబలం ఎక్కువగా ఉంటుంది...ఈ రాశుల వారికి అయితే..!