YS Jagan: YS జగన్‌పై నాన్ బెయిల్‌బుల్ కేసు నమోదు.. జీవిత ఖైదు!

సత్తెనపల్లి పర్యటనలో జగన్ కారు కింద సింగయ్య అనే కార్యకర్త పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో గుంటూరు పోలీసులు తాజాగా BNS 105, 49 సెక్షన్లను చేర్చారు. హత్య కిందకు రాని కల్పబుల్‌ హోమీసైడ్‌‌ని BNS 105 సెక్షన్‌లో పేర్కొన్నారు.

New Update
YS jagan helicoptor

YS jagan helicoptor Photograph: (YS jagan helicoptor)

సత్తెనపల్లి పర్యటనలో జగన్ కారు కింద సింగయ్య అనే కార్యకర్త పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో గుంటూరు పోలీసులు తాజాగా BNS 105, 49 సెక్షన్లను చేర్చారు. హత్య కిందకు రాని కల్పబుల్‌ హోమీసైడ్‌‌ని BNS 105 సెక్షన్‌లో పేర్కొన్నారు. దర్యాప్తులో లభించిన సీసీ ఫుటేజీలు, వీడియోలు, డ్రోన్‌ దృశ్యాలన్నింటినీ విశ్లేషించి ఇది కల్పబుల్‌ హోమీసైడ్ అని ఈ సెక్షన్‌ జత చేశారు. వ్యక్తి చావుకు కారణమైనప్పుడు ఈ సెక్షన్‌ పెడతారు.

Also Read :  సీపీఐ మావోయిస్టు పార్టీలో ప్రక్షాళన...రంగంలోకి అగ్రనేత గణపతి

Also Read :  గాంధీభవన్‌లోకి గొర్రెల మంద.. యాదవుల వినూత్న నిరసన ఎందుకంటే?

Guntur Police Case Filed On YS Jagan

జగన్‌ సహా మిగతా నిందితులపై ఈ సెక్షనే పెట్టారు. నేర నిరూపణ జరిగితే ఈ సెక్షన్‌ కింద జీవిత ఖైదు విధించవచ్చు. నేర తీవ్రతను బట్టి 5నుంచి-10 ఏళ్ల వరకూ జైలు శిక్ష, జరిమానా విధించేందవచ్చు. ఇది నాన్‌  బెయిల్‌బుల్‌ సెక్షన్‌. దీనికి తోడు నేరానికి ప్రేరేపించారనే అభియోగంపై BNS 49 సెక్షన్‌ను ఈ కేసులో చేర్చారు. మొదట నిర్లక్ష్యం కారణంగా చనిపోయాడని బీఎన్‌ఎస్‌ 106(1)) సెక్షన్‌ కింద పోలీసులు కేసు పెట్టారు. తాజాగా దానికి మరో రెండు సెక్షన్లు యాడ్ చేశారు.

Also Read :  ఫిల్మ్ సిటీలో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన సెట్ - షాకింగ్ వీడియో

Also Read :  ఇక భారత్‌కు కష్టకాలమే.. భారీగా పెరిగిన చమురు ధరలు, పడిపోయిన స్టాక్ మార్కెట్లు

 

YS Jagan | jagan in sattenapalli | police-cases | singaiah | latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు