/rtv/media/media_files/2025/05/27/2OAnYlffxQcFpOu3fUN7.jpg)
తెలుగుదేశం పార్టీ కడపలో మహానాడు నిర్వహిస్తోంది. మహానాడుకు రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఈ సభలో పార్టీ భవిష్యత్ ప్రణాళికలు, సిద్ధాంతాలపై చర్చించనున్నారు. మహానాడు కోసం కడప శివారు చెర్లోపల్లిలో భారీ ఏర్పాట్లు చేశారు. మొదటి రెండు రోజులు ప్రతినిధుల సభ, చివరి రోజు బహిరంగ సభ నిర్వహిస్తారు. దీని కోసం 140 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. వాహనాల పార్కింగ్ కోసం 450 ఎకరాలు కేటాయించారు. వేదికపై దాదాపు 450 మంది కూర్చునేలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. చివరి రోజు జరిగే బహిరంగ సభకు దాదాపు 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. కాగా మహానాడుకు వచ్చే కార్యకర్తలకు విందు భోజనాలతో కడుపు నింపే ఏర్పాట్లు కూడా చేశారు.
ఇది కూడా చూడండి: సంచలన అప్‌డేట్.. పుతిన్ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్ బాంబు దాడి !
TDP Mahanadu 2025 Lunch Menu
ఈ మహానాడు కోసం టీడీపీ వెజ్, నాన్‌వెజ్ వంటకాలతో మెనూను సిద్ధం చేసింది. ఏపీమంత్రి బీసీ జనార్థన్ రెడ్డి భోజన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాగా భోజన ఏర్పాట్ల కమిటీలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఎస్.సవితలు ఉన్నారు. వీరితో పాటు అనంతపురం ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, నంద్యాల వరదరాజులరెడ్డి, చింతమనేని ప్రభాకర్, ఆరిమిల్లి రాధాకృష్ణ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరంతో పాటుగా పలువురు నేతలు ఉన్నారు. దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భోజనాల ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. మహానాడుకు హాజరయ్యే పార్టీ ప్రతినిధులకు సుమారు 2 లక్షలమందికి సరిపడా భోజన ఏర్పాటు చేసినట్లు చింతమనేని వివరించారు.
Also Read: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం
మొదటి రోజు భోజనంలో తాపేశ్వరం కాజా, గోంగూర చికెన్, వెజిటబుల్ బిర్యానీ ప్రధానంగా ఉంటాయన్నారు. రెండో రోజు అల్లూరయ్య మైసూర్ పాక్, బిర్యానీ, దోసకాయ మటన్, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మూడో రోజు బగారా రైస్, చికెన్ కర్రీతో మెనూ ఉంటుందన్నారు. వెజ్‌లో కొన్ని కూరలు, సాంబారు, రసం వంటివి ఉంటాయన్నారు. ఈసారి ఆవకాయ కూడా ప్రత్యేకంగా ఉండనుందని తెలిపిన చింతమనేని దానికోసం దెందలూరు నుంచి ప్రత్యేకంగా మామిడికాయలు తీసుకొచ్చానని చెప్పారు.
మహానాడు ప్రాంగణంలో అన్ని వైపులా ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటూ భోజనాల్లో 20 రకాల వంటకాలకు ఏర్పాటు చేస్తున్నారు. కాగా వంటలకోసం 1,700 మంది వంటవారు..వడ్డించేందుకు మరో 800 మందిని నియమించినట్లు తెలిపారు. మహానాడులో విజయవాడకు చెందిన అంబికాస్ క్యాటరింగ్ వారు భోజనాలను తయారు చేస్తున్నారు. 2014 నుంచి మహానాడులో క్యాటరింగ్ చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి శివాజీ తెలిపారు.
రేపటి నుండి మూడు రోజులపాటు కడప జిల్లా సి కె దిన్నె మండలం పబ్బాపురంలో జరగనున్న పసుపు పండుగ మహానాడు ఏర్పాట్లను @ChintamaneniTDP గారు ఇతర నేతలతో కలిసి పరిశీలించడం జరిగింది.
— Devineni Uma (@DevineniUma) May 26, 2025
★మూడు రోజుల పాటు పండుగలా నిర్వహించే మహానాడుకు సర్వం సిద్ధం
★మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు… pic.twitter.com/A0y26oMMz3
ఇది కూడా చూడండి: SRH VS KKR: హ్యాట్రిక్ విజయం..కేకేఆర్ ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్
మహానాడులో సేవలు అందించడం ఆనందంగా ఉందని.. రోజుకు 10వేలమందికి టిఫిన్, రెండు రోజుల పాటూ 50వేలమందికి, 29వ తేదీ సభ నిర్వహించే రోజు లక్షమందికి ఫుడ్ సిద్ధం చేస్తున్నామన్నారు.. 10 లక్షల వాటర్ బాటిల్స్ తెప్పించినట్లు తెలిపారు. ఈసారి రాయలసీమలో మహానాడు నిర్వహిస్తున్నారని.. అందుకే వెజ్, నాన్‌వెజ్ వంటకాలు మెనూలో ఉన్నాయన్నారు. డ్రైఫ్రూట్ హల్వా, చక్కెర పొంగలి, తాపేశ్వరం కాజా, అల్లూరయ్య మైసూర్ పాక్, దోసకాయ మటన్, గోంగూర చికెన్, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ, ఎగ్ కర్రీ మెనూలో ఉన్నాయన్నారు. గతంలో వెజ్ ఎక్కువగా మెనూ ఉండేదని.. ఈసారి మెనూలో నాన్‌వెజ్ వంటకాలు ఉన్నాయన్నారు.
ఇది కూడా చూడండి: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
ఉదయం టిఫిన్ మెనూలో పొంగలి, ఇడ్లీ, టమాటా బాత్, టూటీఫ్రూటీ కేసరి, కాఫీ, టీ, మధ్యాహ్న భోజనం మెనూలో నాన్‌వెజ్ -గోంగూర చికెన్, ఆంధ్రా స్టైల్ చికెన్‌కర్రీ, దోసకాయ మటన్, ఎగ్ రోస్ట్, రోటి పచ్చడి, తెల్లన్నం, ప్లెయిన్ బిర్యానీ, సాంబారు, ఉలవచారు, మామిడికాయ పచ్చడి, పెరుగు ఉండనున్నాయి.
వెజ్‌లో తెల్లన్నం, గోంగూర పూల్ మఖానా, ప్లెయిన్ బిర్యానీ, టమాటా పప్పు, రోటి పచ్చడి, పెరుగు, చిప్స్, ములక్కాయ టమాటా గ్రేవీ, బెండకాయ బూందీ, సాయంత్రం స్నాక్స్ మెనూ కాఫీ, టీతో పాటు కార్న్ సమోసా, బిస్కెట్లు, పకోడీ, మిర్చి బజ్జీలు ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి భోజనం మెనూ రైస్‌తోపాటు వంకాయ బఠాణీ, ఆలూ ఫ్రై, పెసరపప్పు చారు, రోటి పచ్చడి, పెరుగు ఏర్పాటు చేస్తున్నారు.
Also Read: అమెరికాలో పాక్ పౌరుల అరెస్ట్.. వాళ్లు ఏం చిల్లర పని చేశారో తెలుసా?
Mahanadu 2025 Updates | Mahanadu Public Meeting In Kadapa | kadapa tdp mahanadu | food-menu | tdp mahanadu kadapa 2025 | tdp mahanadu 2025 in kadapa