Perni Nani: పవన్ కళ్యాణ్ షిప్ తనిఖీపై మాజీ మంత్రి సెటైర్లు

ఏపీ డిప్యూటీ సీఎం కాకినాడ పోర్ట్ తనిఖీలపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. పోర్ట్ లో డిప్యూటీ సీఎం తనిఖీలు ఓ మంచి ప్రయత్నమని ఆయన అన్నారు. ఈ ప్రయత్నాన్ని అందరూ అభినందించాలి. కానీ ప్రాణాలకు తెగించి పవన్ చేసిన సాహాసంపై అనుమానాలు ఉన్నాయని అన్నారు.

New Update
perninani

కాకినాడ పోర్ట్ లో బియ్యం అక్రమ రవాణా చేస్తున్న షిప్ ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీ చేసిన విషయం తెలిసిందే. తనిఖీలపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. కాకినాడ పోర్ట్ లో డిప్యూటీ సీఎం తనిఖీలు ఓ మంచి ప్రయత్నమని ఆయన అన్నారు. ఈ ప్రయత్నాన్ని అందరూ అభినందించాలి. ప్రాణాలకు తెగించి పవన్ చేసిన ఈ ప్రయత్నంపై కొన్ని అనుమానాలు ఉన్నాయి.

Also Read: అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌.. ఇద్దరు హిందూ పూజారులు అరెస్టు

బోటులోనే కస్టమ్స్, పోర్టు అధికారులు కూడా

తనను షిప్ ఎక్కడానికి అనుమతి ఇవ్వటం లేదని పవన్ చెబుతున్నారు. కానీ.. పవన్ కళ్యాణ్ వెళ్లిన బోటులోనే కస్టమ్స్, పోర్టు అధికారులు కూడా ఉన్నారని పేర్నినాని అన్నారు. పవన్ వెళ్లిన బోటులో కస్టమ్స్, పోర్టు అధికారి ఇద్దరు ఉన్నారని.. అనుమతి ఇవ్వాల్సిన అధికారులు అక్కడే ఉండగా పర్మిషన్ ఇవ్వటం లేదని చెప్పటం ఏంటన్నారు. తనిఖీల్లో పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టులో పెద్ద ఎత్తున పేదల బియ్యం అక్రమంగా ఎగుమతి అవుతున్న విషయంపై స్పందించారు.

Also Read: 6 ఇంజిన్లు, 295 బోగీలు, స్టేషన్ దాటాలంటే గంట సమయం.. మన ఇండియాలోనే!

స్టెల్లా షిప్ సీజ్ చేయమని పవన్ కళ్యాణ్ అంటున్నారు. అక్కడే కెన్ స్టార్ అనే మరో షిప్ కూడా ఉంది. కెన్ స్టార్ షిప్ సీజ్ చేయాలని పవన్ ఎందుకు అనలేదు. స్టెల్లాలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లేదా అతని తమ్ముడి బియ్యం కూడా లేవు. అయినా ఆ షిప్‌లో బియ్యంపై విచారణ చేయాలని కోరుతున్నాం. బియ్యం రవాణా విషయంలో చంద్రబాబు, పవన్ డ్రామా ఆడుతున్నారా?. కెన్ స్టార్ షిప్ యజమాని శ్రీను అనే వ్యక్తిది.

ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు శ్రీను కాబట్టి ఆ షిప్ జోలికి వెళ్ళటం లేదని మాజీ మంత్రి విరుచుకు పడ్డారు. శ్రీను ఒక్కడే 42 వేల టన్నుల పీడీఎస్ బియ్యం రవాణా చేస్తున్నాడని ఆయన ఆరోపిస్తున్నాడు. అందుకే పవన్ కళ్ళకు గంతలు కట్టుకుని కెన్ స్టార్ షిప్ జోలికి వెళ్ళటం లేదు. కెన్ స్టార్ షిప్ కూడా సీజ్ చేయాలని పేర్నినాని డిమాండ్ చేశారు.
Also Read: కాశీ ఆలయంలో కేక్ కట్‌ చేసిన మోడల్‌..ఆగ్రహం వ్యక్తం చేస్తున్నభక్తులు

Also Read: EVMలను హ్యాక్ చేయగలనంటూ యువకుడు సవాల్.. షాక్ ఇచ్చిన పోలీసులు

Advertisment
Advertisment
తాజా కథనాలు