BIG BREAKING: మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టు?

మాజీ మంత్రి కొడాలి నాని నేడో, రేపు అరెస్టు కానున్నట్లు తెలుస్తోంది. కేసు విచారణకు సహకరించకపోవడం, పారిపోతాడనే కారణాలతో ఇప్పటికే నానికి లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే కొడాలి నానిపై ఏపీలో పలు కేసులు ఉన్నాయి.

New Update

మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్ తగలనుంది. నేడో, రేపు కొడాలి నాని అరెస్టు కానున్నట్లు తెలుస్తోంది. కేసుకు విచారణకు సహకరించకపోవడం, పారిపోతాడనే కారణంతో ఇప్పటికే కొడాలి నానిపై లుక్ అవుట్ వారెంట్ జారీ చేశారు. అయితే కొడాలి నాని గత కొంత కాలం నుంచి అనారోగ్యం బారిన పడటంతో చికిత్స తీసుకుంటున్నాడు.

ఇది కూడా చూడండి: Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ

బలవంతంగా రాజీనామా చేయించారని..

కొడాలి నానిపై ఇప్పటికే కేసులు ఉన్నాయి.  రైతు మోషే కేసు, వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. అలాగే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్‌పై సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడారని కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇసుక, మట్టి, భూకబ్జాలకు సంబంధించి ఆరోపణలు, టిడ్కో ఇళ్ల పంపిణీ, జగనన్న కాలనీలో మెరక పేరుతో రూ.45 కోట్ల అవినీతి, విద్యుత్ అక్రమాలపై విజిలెన్స్ ఆరోపణలు ఉన్నాయి. వీటిన్నింటిపై విచారణ జరుగుతోంది.

ఇది కూడా చూడండి: PM Modi-CM Revanth: ఆ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి.. మోదీకి సీఎం రేవంత్ రిక్వెస్ట్!

ఇదిలా ఉండగా కొడాలి నాని ఇటీవల హైదరాబాద్ లోని సంధ్య కన్వెన్షన్ లో ఓ వివాహ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే నానికి ఇటీవల హార్ట్ ఆపరేషన్ జరిగింది. దీంతో ఆయన హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఇది కూడా చూడండి: Pregnant Woman Dies: హాస్పిటల్ సిబ్బంది తప్పుతో 2 ప్రాణాలు బలి.. ఏం జరిగిందంటే?

నాని ఆరోగ్యం ఇంకా సెట్ కాలేదని మెరుగౌన చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్లనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే  కృష్ణ జిల్లా ఎస్పీ నానిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నాని అమెరికా వెళ్లకుండా అడ్డుకునేందుకే ఈ నోటీసులు జారీ అయినట్లు ప్రచారం జరిగింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు