Ambati Rambabu : అంబటి రాంబాబుకు బిగ్‌ షాక్‌..ఆయనపై మరో పీటీ వారెంట్

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు బెయిల్ లభించినప్పటికీ మరో పీటీ వారెంట్‌ జారీ కావడం సంచలనంగా మారింది. సత్తెనపల్లి పోలీసులు ఆయనపై గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టులో ఈ వారెంట్ వేయడం గమనార్హం. దీంతో ఆయన విడుదలపై ఉత్కంఠ నెలకొంది.

New Update
Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu : మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు(Ambati Rambabu arrest news) కు బెయిల్ లభించినప్పటికీ మరో పీటీ వారెంట్‌ జారీ కావడం సంచలనంగా మారింది. సత్తెనపల్లి పోలీసులు ఆయనపై గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టులో ఈ వారెంట్ వేయడం గమనార్హం. సత్తెనపల్లిలో గత సంక్రాంతి పండుగ సందర్భంగా లక్కీ డ్రా పేరుతో అంబటి వసూళ్లకు పాల్పడినట్లు పోలీసులకు పలు  ఫిర్యాదులు అందాయి. అంబటి నేతృత్వంలో లక్కీ డ్రా పేరుతో లాటరీ టికెట్ల అమ్మకాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. సచివాలయ వలంటీర్స్ ద్వారా ఈ టికెట్ల అమ్మకాలు చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి.

Also Read :  రైతులకు గుడ్‌ న్యూస్‌.. పీఎం కిసాన్ సమ్మాన్‌ పై అదిరిపోయే అప్డేట్!

Another PT Warrant Against For Ambati Rambabu

2023లో నిర్వహించిన సంక్రాంతి లక్కీ డ్రా లాటరీ టికెట్ల అమ్మకాలపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో గతంలో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. లాటరీ టికెట్ల అమ్మకాల సందర్భంలో కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని పోలీసులకు జనసేన నేతలు ఫిర్యాదు చేశారు.ఆ సమయంలో పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు సబ్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు అంబటి రాంబాబుపై 2023 జనవరి 16న సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అయితే నాటి లక్కీ డ్రా కేసులో తాజాగా పీటీ వారెంట్ జారీ కావడం చర్చనీయంశంగా మారింది.

కాగా, అంబటి రాంబాబు(Ambati Ram Babu) పై పలు కేసులు ఉండటంతో ఆయనకు బెయిల్‌ వచ్చినప్పటికీ విడుదల కాలేని పరిస్థితి నెలకొంటుంది. మూడు రోజుల క్రితం కూడా అంబటి రాంబాబుకు సంబంధించిన కేసులో పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గతేడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల పీపీపీ (PPP) మోడల్‌ను వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టిన అంబటి.. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుని వెళ్లినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై అప్పట్లోనే పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ విషయంపై కేసు దర్యాప్తు జరుగుతోందని పోలీసులు పీటీ వారెంట్లో ప్రస్తావించారు.  లాటరీ టికెట్ల అంశంలో ఆయనపై తాజాగా కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన జడ్జి అంబటి రాంబాబును ధర్మాసనం ఎదుట హాజరుపర్చాలని ఆదేశాలు జారీ చేయడంతో ఆయన విడుదలపై సందిగ్ధత నెలకొంది.

Also Read :  ఉల్లిపాయల మాటున గంజాయి స్మగ్లింగ్.. గుట్టురట్టు చేసిన పోలీసులు!

Advertisment
తాజా కథనాలు