Waqf Bill: వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం

రెండు రోజులుగా విపరీతమైన చర్చ జరుగుతున్న వక్ఫ్  సవరణ బిల్లుకు రాజ్యసభ కూడా పచ్చజెండా ఊపేసింది. రాజ్యసభలో కూడా అర్ధరాత్రి వరకూ దీనిపై చర్చ జరిగింది. ఈ బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది ఓటేశారు. 

New Update
Rajya Sabha: రాజ్యసభ ఉప ఎన్నికల్లో 12 స్థానాల్లో ఎన్డీయే ఏకగ్రీవం

Rajya Sabha

దేశ వ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లు మీద చర్చ అయింది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు దారి తీసింది. వరుసగా రెండు రోజుల పాటూ పార్లమెంట్ వాడీ వేడి చర్చలతో ఊగిపోయింది. అర్ధరాత్రిళ్ళ వరకూ రెండు సభల్లోనూ ఈ బిల్లుపై చర్చించారు. లోక్ సభ విమర్శలు, ప్రతి విమర్శలతో సభలు ప్రతిధ్వనించాయి. అధికార పక్షంతో పాటూ  బీజేపీకి జేడీయు, శివసేన, లోక్ జనశక్తి పార్టీలు మద్దతునిచ్చాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి, ఎంఐఎం లాంటివి తీవ్రంగా వ్యతిరేకించాయి. లోక్ సభలో 282 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా, 232 మంది వ్యతిరేకించారు. 

రాజ్యసభలోనూ విపరీతమైన చర్చ..

మరోవైపు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. దాదాపు నిన్నంతా వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ జరిగింది. ఇక్కడ కూడా అధికార, ప్రతిపక్షాలు కొట్టుకున్నాయి. అర్ధరాత్రి వరకు వాగ్వాదం కొనసాగింది. చివరకు అర్ధరాత్రి దాటాక కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు సమాధానం అనంతరం సవరణల వారీగా ఓటింగ్‌ జరిగింది. బిలులకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది ఓటేశారు. విపక్షాలు ప్రతిపాదించిన సవరణలకు ఆమోదం లభించలేదు. కొందరు విపక్ష ఎంపీలు బిల్లుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు వచ్చారు. వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయటం ప్రభుత్వం ఉద్దేశం కాదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డులో టెక్నాలజీని ప్రవేశపెట్టడం ద్వారా  దాని పనితీరు మెరుగుపర్చడమే ప్రహుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ బిల్లుకు మతంతో ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. అన్ని వర్గాలకు చెందిన ముస్లింలను ఇందులోకి తీసుకువస్తామని కేంద్రమంత్రి కిరణ్ రిజుజు చెప్పారు. 2004లో 4.9 లక్షలుగా ఉన్న వక్ఫ్‌ ఆస్తులు ఇప్పుడు 8.72 లక్షలకు పెరిగినట్లు సభ దృష్టికి తెచ్చారు. ముస్లింలలోని షియా, సున్నీలతో పాటు ఇతర వెనుకబడిన తరగతుల వారు వక్ఫ్‌ బోర్డు సభ్యులుగా కొనసాగేలా కొత్త నిబంధనలు చేర్చామని చెప్పారు. 22 మంది సభ్యులతో ఏర్పడే సెంట్రల్‌ వక్ఫ్‌ కౌన్సిల్‌ కూర్పుపై వ్యక్తమవుతున్న సందేహాలకు ఆయన సమాధానమిచ్చారు. ముస్లిమేతరులు అత్యధికంగా ఉంటారనే సమస్యే లేదని తేల్చి చెప్పారు. 

today-latest-news-in-telugu | Waqf Bill 2025 | rajya-sabha

 

Also Read: Ap Weather Report: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు