ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి రోజుకో గుడ్ న్యూస్ వస్తుంది. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డు, కొత్త రైల్వే లైన్ సహా రోడ్డు విస్తరణ వంటి ప్రాజెక్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ప్రస్తుతం వీటి పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. అమరావతిలో 150 పడకల సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజ్, 500 పడకల ఈఎస్ఐ సెకండరీ కేర్ హాస్పిటల్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేశారు.
Also Read: ట్రంప్ గెలుపు...అమెరికాకు గుడ్ బై చెబుతున్న హాలీవుడ్ హీరోయిన్లు
కానీ రాష్ట్ర విభజన అనంతరం ఈ హాస్పిటల్ తెలంగాణకు వెళ్లిపోయింది. దీంతో ఏపీలోని అమరావతిలో ఒక ఈఎస్ఐ హాస్పిటల్ ఉండాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించగా.. దానికి కేంద్రం సానుకూలంగా స్పందించింది.
Also Read: ట్రంప్ గెలవడానికి మీరే కారణం..మీతో సెక్స్ చేయం-యూఎస్ మహిళలు
దీంతో జాతీయ వైద్య కమిషన్ నిబంధనల ప్రకారం.. మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు 25 ఎకరాలు, ఈఎస్ఐ నిబంధనల ప్రకారం.. 500 పడకల హాస్పిటల్ నిర్మాణానికి 10 ఎకరాల భూమి అవసరం కాగా.. దీనిని ఏపీ ప్రభుత్వం కేటాయించనుంది. కాగా ఇప్పటికే అమరావతిలో రింగు రోడ్డు, కొత్త ట్రైన్ లైన్ వంటివి వస్తున్నాయి. అంతేకాకుండా భవిష్యత్ లో రాష్ట్రంలో పలు ఐటీ కంపెనీలు, విద్యా సంస్థలు, హూటల్స, పరిశ్రమలు సహా మరెన్నో రానున్నాయి.
Also Read: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్
వాటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అమరావతిలో ఈఎస్ఐ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికి రాష్ట్రవ్యాప్తంగా 14,55,987 మంది ఈఎస్ఐ ఉద్యోగులు ఉండగా.. అందులో విజయవాడ, గుంటూరు పరిధిలో సుమారు 4 లక్షలకు పైగా ఉన్నారు. వీరిని దృష్టిలో పెట్టుకుని అమరావతిలో వీటిని ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యారు.