/rtv/media/media_files/2026/01/27/fotojet-28-2026-01-27-17-46-43.jpg)
Akira Nandan
Akira Nandan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(ap-deputy-cm-pawan-kalyan) కుమారుడు అకీరా నందన్ ఢిల్లీ హైకోర్టు(delhi-high-court) ను ఆశ్రయించాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందించిన ఓ సినిమా మూలంగా తన వ్యక్తిత్వం, గోప్యతా హక్కులను ఉల్లంఘించారని ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. ఏఐ మార్ఫింగ్ డీప్ ఫేక్ టెక్నాలజీతో రూపొందించిన ఈ సినిమాలో తన ముఖ కవళికలు, స్వరం, వ్యక్తిత్వాన్ని ఉపయోగించారని ఆ పిటిషన్‌లో ఆరోపించారు. ఏఐ సినిమాతో పాటు, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్‌లలో పెద్ద సంఖ్యలో తన పేరుతో నకిలీ ప్రొఫైల్స్, సోషల్ మీడియా పేజీలు ఉన్నాయని, వాటిని తొలగించాలని హైకోర్టును అకీరా నందన్ అభ్యర్థించాడు.
కాగా దీన్ని స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు ఆయనకు ఊరటనిచ్చింది. అకీరా(Akira Nandan latest updates) అనుమతి లేకుండా తీసిన ‘ఏఐ లవ్ స్టోరీ’ సినిమాపై కోర్టు తాత్కాలిక నిషేధం విధించింది. ‘ఏఐ లవ్‌స్టోరీ’లో తన ముఖం, స్వరాన్ని మార్ఫింగ్ చేశారని అకీరా నందన్ కోర్టును ఆశ్రయించారు. సినిమాతో పాటు, యూట్యూబ్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ ఎక్స్‌లో తన పేరుతో ఉన్న నకిలీ ప్రొఫైల్ పేజీలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అకీరా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తుషార్ రావు తన తీర్పులో కీలక అంశాలు ప్రస్తావించారు. అందులో అకీరా నందన్ అనుమతి లేకుండా అతడి పేరు, ఫొటోలు, స్వరం, వ్యక్తిత్వాన్ని ఉపయోగించి ఎలాంటి ఏఐ లేదా డీప్ ఫేక్ కంటెంట్ తయారు చేయకూడదని ఆదేశించారు. అలాగే ఏఐ లవ్ స్టోరీ మూవీని సోషల్‌మీడియాలో ఉంచడం, షేర్ చేయడం పూర్తిగా నిషేధించారు. సోషల్ మీడియా సంస్థలు వెంటనే అకీరా పేరుతో సృష్టించిన నకిలీ ఖాతాలను తొలగించాలని ఆదేశించారు. కృత్రిమ మేధస్సు, డీప్ ఫేక్ సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా అకీరా నందన్ పేరు, ఇమేజ్, పోలిక, స్వరం, వ్యక్తిత్వాన్ని ఉపయోగించడం దోపిడీ చేయడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. పిటిషనర్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వక్రీకరించిన కంటెంట్‌ను రూపొందించడం అతని గోప్యతా హక్కును ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది.
ఈ వీడియోకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలు తొలగించాలని, ఐపి వివరాలను బహిర్గతం చేయాలని మెటా, యూట్యూబ్, ఇన్ స్ఠాగ్రామ్, ఫేస్ బుక్ , ఎక్స్ సంస్థలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అకీరా నందన్ తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. గూగుల్ తరఫున ఆదిత్యా గుప్తా, మెటా తరఫున వరుణ్ పాఠక్ న్యాయవాదులు కోర్టులో హాజరయ్యారు.
కాగా గుర్తు తెలియని వ్యక్తులు ‘ఏఐ లవ్‌స్టోరీ’ మల్టీపుల్ వెర్షన్స్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. తెలుగులో ఉన్న సినిమాకు ఇప్పటికే 11లక్షలకుపైగా వీక్షణలు వచ్చాయి. ఇంగ్లీష్ వెర్షన్‌ను దాదాపు పాతిక వేల మంది చూశారు. వీటితో పాటు, వివిధ సామాజిక మాధ్యమాల వేదికగా అకీరా పేరుతో వందల కొద్దీ ఖాతాలను క్రియేట్ చేశారు. అకీరా పేరుతో విరాళాలు సేకరించడం, ఆర్థిక దుర్వినియోగం జరుగుతున్నట్లు అకీరా, అతడి కుటుంబ సభ్యుల దృష్టికి రావడంతో కోర్టును ఆశ్రయించారు.
Also Read : పెళ్లి చేసుకుంటా.. విడాకులు ఇచ్చేయ్.. వెలుగులోకి జనసేన ఎమ్మెల్యే కీచక పర్వం
డీప్‌ఫేక్ కంటెంట్..వ్యక్తి అరెస్ట్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ లక్ష్యంగా చేసుకుని ఏఐ (AI) ఆధారిత డీప్‌ఫేక్ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వ్యక్తిని కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. అకీరా నందన్ పేరు, ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా వినియోగించి, తప్పుడు రీతిలో డీప్‌ఫేక్ కంటెంట్ తయారు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.ఈ డీప్‌ఫేక్ వీడియోల కారణంగా తన వ్యక్తిగత గోప్యత, భద్రతకు ముప్పు ఏర్పడిందని అకీరా నందన్ ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తనకు సంబంధించిన కంటెంట్‌ను డీప్‌ఫేక్ వీడియోలుగా సృష్టించి, అనుమతి లేకుండా ప్రచారం చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని కోర్టును ఆయన కోరారు. అకీరా నందన్ కేసులో వేగంగా స్పందించిన సర్పవరం పోలీసులు డీప్‌ఫేక్ వీడియోలు రూపొందించిన వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేశారు.
Also Read : ఏపీలో రాజు వెడ్స్ రాంబాయి సినిమా సీన్.. ప్రియుడి భార్యకు వైరస్ ఇంజెక్షన్!
Follow Us