/rtv/media/media_files/2025/05/21/RidBxUmVBnEEKqs1soDd.jpg)
covid cases in india
ఏపీలో కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే రెండు కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో మూడు కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఏలూరుకు చెందిన ఇద్దరు భార్యాభర్తలకు, తెనాలిలో ఓ 83 ఏళ్ళ వృద్ధుడికి కరోనా సోకింది. ఇందులో వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉంది. అంతకు ముందు కడపలో ఇద్దరికి, వైజాగ్ లో మరొకరికి కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
Also Read : ట్రంప్ పేరుతో మోసం..కోట్లరూపాయలు యాప్ లో పెట్టుబడులు
Also Read : నైరుతి రుతుపవనాలు ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
భయపడాల్సిన అవసరం లేదు..
మళ్లీ కరోనా మరణాలు మొదలయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు ఏడుగురు మృతిచెందినట్లు ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు ఇప్పటికే వెయ్యి దాటాయి. దేశ రాజధానిలో కరోనా కేసుల సంఖ్య వందకు చేరింది. అదే సమయంలో తెలుగు రాష్ర్టాల్లో ముగ్గురికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. అయితే దేశవ్యాప్తంగా కరోనా కేసులు పుంజుకుంటున్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీని కరోనా వణికిస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ వందమందికి పైగా వైరస్ బాధితులను ఇంట్లో క్వారంటైన్ చేసినట్లు వైద్యులు వెల్లడించారు.-- కేరళ, మహారాష్ట్రలో కరోనా డేంజర్ బెల్స్‌మోగిస్తోంది. ఇక్కడ 430 కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య, ఆరోగ్య శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. దానితో పాటు మహారాష్ర్టలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి.209 యాక్టివ్ కేసులు ఆ రాష్ట్రంలో నమోదయ్యాయి. వీటితో పాటు ఢిల్లీ 104, గుజరాత్‌లో 83, ఉత్తరప్రదేశ్ లో 15, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 12 కేసులు, కర్ణాటకలో 57 మందికి పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
Also Read : మాజీ ఎమ్మెల్యే సోదరుడు టార్గెట్.. మావోయిస్టుల పేరుతో లేఖ..
Also Read : ఆ దేశాల్లో భారీ భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు
today-latest-news-in-telugu | corona | covid-19 | Andhra Pradesh
 Follow Us
 Follow Us