Big breaking : ఏలూరులో కరోనా డేంజర్ బెల్స్

ఏలూరు జిల్లా కేంద్రంలో కరోనామహమ్మారి కలకలం సృష్టించింది. ఏలూరు కలెక్టరేట్‌ ఉద్యోగులకు కరోనా సోకింది. కలెక్టరేట్‌ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పనిచేస్తున్న నలుగురుకి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కలెక్టరేట్‌ వర్గాలు అప్రమత్తమయ్యాయి.   

New Update
WHO: కరోనా మహమ్మారి ఎఫెక్ట్.. తగ్గిన ఆయుర్దాయం.!

Corona danger bells in Eluru

Big breaking :  దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు ఏపీలోనూ కరోనా తన ప్రభావాన్ని చూపిస్తోంది. తాజాగా ఏలూరులో కరోనా డేంజర్‌ బెల్స్ మోగుతున్నాయి. ఏలూరు జిల్లా కేంద్రంలో కరోనామహమ్మారి కలకలం సృష్టించింది. ఏలూరు కలెక్టరేట్‌ఉద్యోగులకు కరోనా సోకింది. కలెక్టరేట్‌ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పనిచేస్తున్న నలుగురు సిబ్బందికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కలెక్టరేట్‌ వర్గాలు అప్రమత్తమయ్యాయి.   

Also Read:Viral Video: బురఖా వేసుకున్న మహిళని ఈ నీచుడు ఏం చేశాడో చూడండి! వీడియో వైరల్


వెంటనే స్పందించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే నివారణ చర్యలు చేపట్టారు.  పాజిటివ్ వచ్చిన ఉద్యోగులు ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.  కాగా ప్రతీ సోమవారం నిర్వహించే పబ్లిక్ గ్రీవెన్స్ లో పని చేసే ఓ ఉద్యోగికి కరోనా నిర్దారణ అయింది. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కలెక్టరేట్ ఉద్యోగులందరికీ కోవిడ్ టెస్ట్ చేయగా ముగ్గురికి కరోనాగా నిర్దారణ అయింది.ముందు జాగ్రత్త చర్యగా కలెక్టరేట్‌లోని ఇతర ఉద్యోగులు, సిబ్బందికి కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఉద్కోగులకు కరోనా సోకిన విషయాన్ని  అధికారులు గోప్యంగా ఉంచడం విమర్శలకు దారి తీసింది. కరోనా సోకిన విషయాన్ని దాచి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి:ఏపీలో మరో లవ్‌స్టోరీ.. ప్రేమ విఫలమైందని బాలిక ఆత్మహత్యాయత్నం

కాగా, నాలుగు రోజుల క్రితం ఏలూరులోని శాంతినగర్‌కు చెందిన ఇద్దరు వృద్ధులకు కూడా కరోనా నిర్ధారణ అయింది. వారిని మెరుగైన చికిత్స కోసం గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. తాజా కేసులతో జిల్లాలో  కలకలం రేగింది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం వంటి కొవిడ్ నిబంధనలు పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. గుంపులుగా తిరగడం, విందులు వినోదాలకు కొంత దూరం పాటించాలని కోరారు.

Also Read: మధ్యప్రదేశ్‌లో విషాదం... కన్నబిడ్డను కాపాడలేనన్న భయంలో ప్రాణం విడిచిన తండ్రి

Advertisment
తాజా కథనాలు