BIG BREAKING  : మాజీ ఎంపీ పుల్లయ్య కన్నుమూత

అనంతపురం కాంగ్రెస్ మాజీ ఎంపీ (1977, 1980) దరూరు పుల్లయ్య (93) గుండెపోటుతో కన్నుమూశారు. కర్ణాటకలో ఉన్న పొలాన్ని చూడటానికి వెళ్లారు. తిరిగి వెళ్తూ కంప్లిలో స్నేహితుడితో మాట్లాడేందుకు కారు దిగి అక్కడే గుండెపోటుతో కుప్పకూలి చనిపోయారు.

New Update
congress-party ex mp

congress-party ex mp

కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. అనంతపురం కాంగ్రెస్ మాజీ ఎంపీ (1977, 1980) దరూరు పుల్లయ్య (93) గుండెపోటుతో కన్నుమూశారు. ప్రస్తుతం బళ్లారిలో ఉంటున్న ఆయన నిన్న అక్కడి నుంచి కంప్లి కొట్టాల (కర్ణాటక)లో ఉన్న పొలాన్ని చూడటానికి వెళ్లారు. తిరిగి వెళ్తూ కంప్లిలో స్నేహితుడితో మాట్లాడేందుకు కారు దిగి అక్కడే గుండెపోటుతో కుప్పకూలి చనిపోయారు. పుల్లయ్య మృతదేహాన్ని బళ్లారిలోని ఇంటికి తరలించారు. ఈయన సొంతూరు అనంతపురం జిల్లా  వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామం.  

Also Read : KPHB : ఎంతకు తెగించావ్రా..  తనకిచ్చి పెళ్లి చేయలేదని ఆమె భర్తనే చంపేశాడు!

Also read :  విమాన ప్రయాణికులకు అలర్ట్.. ఆ సిటీల్లో విమాన సర్వీసులు బంద్

రాజకీయ నాయకులు సంతాపం

ఆయన  కుమార్తె అమెరికాలో ఉండటంతో ఆమె వచ్చాక బళ్లారి లేదా ఛాయాపురంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుమారుడు దరూరు రమేశ్‌ వెల్లడించారు. 1977-79, 1982-85 వరకు లోక్‌సభ సభ్యుడిగా పని చేశారు.  అంతేకాకుండా  1965 నుంచి 1977 వరకు కంప్లి షుగర్‌ ఫ్యాక్టరీ డైరెక్టర్‌గా, బీడీసీసీ బ్యాంకు డైరెక్టర్‌గా పని చేశారు.  పుల్లయ్య మృతి పట్ల ఏపీలోని ప్రముఖ రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.  దరూరు పుల్లయ్య మృతి బాధాకరమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు  తెలిపారు.

Also read :   అప్పులకు బలైన రైతు.. పంట దిగుబడి రాక బావిలోకి దూకి!  

Also read :  BIG BREAKING: ఏపీలో లిక్కర్ స్కామ్ లో మరో కీలక వ్యక్తి అరెస్ట్!

Advertisment
Advertisment
తాజా కథనాలు