/rtv/media/media_files/2025/05/13/5II4KTX8M2xF2EZI382B.jpg)
తాను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి మరో అబ్బాయిని పెళ్లి చేసుకుందని పగ పెంచుకున్న ఓ యువకుడు ఆ అమ్మాయి భర్తను అతి కిరాతకంగా చంపేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లో కేపీహెచ్‌బీకాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిప వివరాల ప్రకారం.. రాజమండ్రికి చెందిన శ్రావణి సంధ్యకు ఏడేళ్ల క్రితం కాళ్ల వెంకటరమణతో పెళ్లి అయింది. కేపీహెచ్‌బీ కాలనీ భగత్‌సింగ్‌నగర్ ఫేజ్-1లో ఉంటూ వెంకటరమణ డ్రైవర్‌గా చేస్తున్నాడు. ఈ దంపతులకు పిల్లలు లేరు. వీరుంటున్న ఇంటి సమీపంలోనే తోడల్లుడు దుర్గాప్రసాద్ ఉంటున్నాడు.
Also read : విమాన ప్రయాణికులకు అలర్ట్.. ఆ సిటీల్లో విమాన సర్వీసులు బంద్
సొంతూరులో ఓ పెళ్లి ఉండగా
అయితే వీరి భార్యలు తమ సొంతూరులో ఓ పెళ్లి ఉండగా వెళ్లిపోయారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో దుర్గాప్రసాద్ డ్యూటీకి వెళ్లగా.. అతని గదిలో వెంకటరమణతోపాటు దుర్గాప్రసాద్ తమ్ముడు జగదీశ్, బావమరిది లక్ష్మీనారాయణ ఉన్నారు. రాత్రి 12.20 గంటల సమయంలో గది వెనక ఖాళీ స్థలంలో ఐదుగురు యువకులు గట్టిగా అరుస్తున్నారు. దీంతో అక్కడ ఏం జరుగుతోందో అనిచ చూద్దామని వెంకటరమణ అపార్ట్‌మెంట్ పార్కింగ్ ప్రదేశానికి వెళ్లాడు. అప్పటికే పక్కా స్కెచ్ వేసుకుని ఉన్న పంపెన అయ్యప్పస్వామి అలియాస్ పవన్(27) కత్తితో వెంకటరమణ గుండెల్లో పొడిచాడు. దీంతో నిమిషాల వ్యవధిలోనే వెంకటరమణ ప్రాణాలు కోల్పోయాడు.
వాస్తవానికి పవన్, శ్రావణి సంధ్యకి సుమారుగా 8 ఏళ్లుగా పరిచయం ఉంది. పవన్ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రావణిని పెళ్లి చేసుకుంటానని అడిగించాడు. అయితే పవన్ ప్రవర్తన సరిగ్గా ఉండకపోవడంతో అతనితో పెళ్లికి శ్రావణి తల్లిదండ్రులు నిరాకరించారు. వెంకటరమణతో పెళ్లి చేయించారు. వివాహం తర్వాత పవన్, శ్రావణి సంధ్య టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పవన్ పరారీలో ఉండగా మరో నలుగురి కోసం పోలీసులు వెతుకుతున్నారు.
Also read : అప్పులకు బలైన రైతు.. పంట దిగుబడి రాక బావిలోకి దూకి!