BIG BREAKING: ఏపీలో లిక్కర్ స్కామ్ లో మరో కీలక వ్యక్తి అరెస్ట్!

ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలకమైన గోవిందప్ప బాలాజీ ని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. గోవిందప్పను మైసూర్ లో అరెస్ట్ చేసిన సిట్ అధికారులు విజయవాడ కు తరలిస్తున్నారు.

New Update
BREAKING: వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలకమైన గోవిందప్ప బాలాజీ ని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. గోవిందప్పను మైసూర్ లో అరెస్ట్ చేసిన సిట్ అధికారులు విజయవాడ కు తరలిస్తున్నారు. ఈ వ్యవహారంలో అతను ఏ33 గా ఉన్నారు. బాలాజీ భారతి సిమెంట్ లో డెరైక్టర్ గా ఉన్నారు. బాలాజీ ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. సుప్రీం కోర్టులో విచారణ దశలో ఉంది. ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయినప్పటి నుంచి గోవిందప్ప అజ్ఞాతంలో ఉన్నారు. బాలాజీ అరెస్టు తో లిక్కర్ కేసులో అరెస్టులు ఐదుకు చేరుకున్నాయి. 

సీఎంఓ మాజీ సెక్రటరీ ధనుంజయరెడ్డి, సీఎం మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి మూడు రోజల క్రితం సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆదివారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని సిట్ ఆఫీస్ లో విచారణకు రావాలని స్పష్టం చేశారు. అయితే.. ఈ ముగ్గురు విచారణకు హాజరుకాలేదు. తాజాగా సుప్రీంకోర్టు కూడా వీరి బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. 

రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు..

ఈ ఇద్దరికీ ప్రస్తుతం అరెస్ట్ అయిన గోవిందప్ప మంచి స్నేహితుడు అన్న ప్రచారం ఉంది. ఈ ముగ్గురు కలిసి మద్యం సప్లై కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేయడం, ఆ డబ్బులను ఫేక్ కంపెనీలకు మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ స్కామ్ కు సంబంధించి మరికొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. 

(ap liquor scam | ap-news | telugu-news | telugu breaking news )

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు