CM Chandrababu : MLA లకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్!

కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఏపీ క్యాబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రధానంగా చర్చించారు.

New Update
chandrababu

కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఏపీ క్యాబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రధానంగా చర్చించారు. కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహారం తలనొప్పిగా మారిందని చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. గాడితప్పుతున్న ఎమ్మెల్యేల విషయంలో ఇన్‌ఛార్జ్‌ మంత్రులు బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు. దస్త్రాల క్లియరెన్స్‌లో వేగం పెంచాలని సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు.

మరోవైపు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి తీరుపై సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. అటవీశాఖ సిబ్బందితో ఎమ్మెల్యే వివాదంపై సీఎం ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు సీఎం. ఉద్యోగులతో ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు . తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించారు చంద్రబాబు. 

కొనసాగుతోన్న క్యాబినెట్ భేటీ

మరోవైపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్ భేటీ కొనసాగుతోంది. సీఆర్డీఏ పరిధిలో అభివృద్ధికి రూ.904 కోట్ల మంజూరు, రాజధాని ప్రాంతంలో కొన్ని సంస్థలకు భూ కేటాయింపులు, జిల్లాల పునర్విభజన, పలు జిల్లాల పేర్ల మార్పుతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు తదితర అంశాలపై సుధీర్ఘంగా  చర్చ జరుగుతోంది. కాసేపట్లో మంత్రివర్గ భేటీ నిర్ణయాలను మంత్రులు మీడియాకు వెల్లడించనున్నారు.

సీఎం చంద్రబాబు ఈ రోజు సాయంత్రం 6 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్రానికి ఆర్థిక సహాయం, అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. రేపు మధ్యాహ్నం వరకు ఆయన ఢిల్లీలో ఉంటారు.

Advertisment
తాజా కథనాలు